మహారాష్ట్రలో బీజేపీ ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్... ఫడ్నవీస్ రాజీనామా

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించని మలుపులు చోటు చేసుకుంటూ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తరహాలో డ్రామా కొనసాగింది.ముందుగా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ భావించిన ఊహించని విధంగా మరల బీజేపీ ఫీల్డ్ లోకి వచ్చి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

 Fadnavis Resign For Chief Minister-TeluguStop.com

అచ్చంగా కర్ణాటక తరహాలో నడిచిన ఈ రాజకీయం మరల అదే తరహాలో ముగిసిపోతుందని ఎవరూ ఊహించలేదు.ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ని తనవైపు లాక్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన బీజేపీకి సుప్రీం కోర్టు ఓ విధంగా షాక్ ఇచ్చింది.

</br>

బీజేపీ ప్రభుత్వం బల నిరూపణ ఎదుర్కోవాలని చెప్పిన కొద్దిసేపటికి ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ పదవికి రాజీనామా చేశారు.  దీంతో ఒక్కసారిగా రాజకీయం మలుపులు తీసుకుంది.

తాజాగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేసారు.దీంతో మళ్ళీ మహారాష్ట్ర రాజకీయం మొదటికి వచ్చినట్లు అయ్యింది.

  ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు హర్షం వ్యక్తం చేస్తూ న్యాయం గెలిచిందని వ్యాఖ్యలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube