అద్దె ఇంటి వేటలో పడ్డ మాజీ సీఎం

మహారాష్ట్ర రాజకీయాల్లో పలు ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.సీఎం నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ పరిస్థితుల్లో చివరికి మహారాష్ట్ర సీఎం గా శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

 Fadnavis On House-TeluguStop.com

దీనితో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది.ఈ క్రమం లో ఆయన ముంబయిలోనే ఒక అద్దె ఇంటికోసం వేట ప్రారంభించినట్లు తెలుస్తుంది.వాస్తవానికి నాగ పూర్ కు చెందిన ఫడ్నవీస్ తన సొంతూరుకు వెళ్లకుండా తిరిగి ముంబాయి లోనే తన మకాం వేయాలని చూస్తున్నారు.2014 లో మహారాష్ట్ర సీఎం గా భాద్యతలు స్వీకరించిన ఆయన నాగపూర్ నుంచి ముంబై కి తన కుటుంబాన్ని షిఫ్ట్ చేశారు.ఆయన సతీమణి అమృత ముంబయి లోని యాక్సిస్ బ్యాంక్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తుండడం,ఆయన కుమార్తె కూడా ముంబయి లోనే చదువుకుంటుండడం తో ఆయన తిరిగి నాగపూర్ కు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ని మాత్రం దాటలేకపోయింది.

దీనితో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరచడం లో బీజేపీ వ్యూహాలు అన్నీ బెడిసికొట్టాయి.

మహారాష్ట్ర సీఎం గా మరోసారి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అసెంబ్లీ లో తన బలాన్ని నిరూపించుకోవడం లో విఫలమవడం తో వెంటనే ఆయన తనపదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

దీనితో సీఎం అధికారిక నివాసం అయిన మలబార్ హిల్‌లోని వర్ష బంగ్లా ను నిన్న మధ్యాహ్నం ఖాళీ చేసినట్లు ఓ ప్రభుత్వ అధికారి మీడియాకు వెల్లడించారు.దీనితో ఇప్పుడు ఆయన అద్దె ఇంటి వేటలో ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube