బిగ్ బాస్ 2 అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు..! లైఫ్ గురించి ఈ విషయాలు కూడా నేర్చుకోవచ్చు.!

11 మంది మైదానంలో ఆడే క్రికెట్ ఆటని చూసి జీవితానికి పనికొచ్చేది నేర్చుకునేదానికన్నా 16 మంది బిగ్ బాస్ హౌసులో ప్రవర్తించే తీరుని చూసి ఎక్కువ నేర్చుకోవచ్చు.ఎలా ఉంటే అందరికీ నచ్చుతాం, ఎలా ఉండడం వల్ల నచ్చము, ఏం చేయకుండా ఉంటే సహజంగా కనపడతాం, ఏం చేస్తే నటిస్తున్నట్టు తెలిసిపోతాం…ఇలా ఎన్నో నేర్చుకోవచ్చు.

 Factsabout Big Boss Telugu Season 2-TeluguStop.com

తొలివారం ముగిసేసరికి సంజన ఎలిమినేట్ అయ్యారు.అది అందరూ ఊహించినదే, చాలామంది ఆశించినదే.ఆమెకి ఓడినా జనం మనసుని గెలిచే ఆఖరి అవకాశం ఇవ్వడం జరిగింది.ఆమె ఆ నాలుగు నిమిషాలు తన ఒరిజినాలిటీని పక్కనపెట్టి నటించి ఉంటే సరిపోయేది.చివరకి వెళిపోయేటప్పుడు కూడా ఆమె తన ఒరిజినాలిటీని దాచలేకపోయింది.ఆటని ఆటగా తీసుకోకుండా బయటికొచ్చికూడా తనకి నచ్చని వాళ్లకి కటవుగా క్లాసు పీకింది.

ఇక మిగిలినవారిని చూస్తుంటే…

* నూతన్ నాయుడు మేకప్పేసి తన ఒరిజినాలిటీని దాస్తున్నట్టు.
* కిరీటి మాట్లాడితేనే మార్కులొస్తాయని ఎక్కువ మాట్లాడుతున్నట్టు…
* గణేష్ తన అమాయకపు నవ్వులతో ఏం చెయ్యాలో తెలియక చోద్యం చూస్తున్నట్టు…
* కౌశల్ టి.ఆర్.పి కి రొమాన్సే కరెక్ట్ అని భావించి తన రొమాంటిక్ యాంగిల్ చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు…

* గీతామాధురి అందరికీ మంచి అవ్వాలనే ప్రయత్నంలో ఎవర్నీ డైరెక్ట్ గా ఖండించకుండా జాగ్రత్త పడుతున్నట్టు.
* దీప్తి సునైన సింపతీ మార్కులతో బండి లాగించడానికి ప్రయత్నిస్తున్నట్టు…
* తనీష్ తన చాక్లెట్ బాయ్ ఇమేజ్ పొగొట్టుకోవడానికి తరచు సిగిరెట్టు తాగుతున్నట్టు.
* తేజశ్వి రకరకాలుగా పాచికలాడో, పరాచికాలాడో టైటిల్ తన్నుకుపోవాలనే సంకల్పంతో ఉన్నట్టు.
ఇలా రకరకాల వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి.

స్క్రిప్ట్ ఉంటే ఒరిజినాలిటీ రాదు.అప్పుడు అంతా నటనే ఉంటుంది.స్క్రిప్ట్ లేకుండా ఉన్నప్పుడే కదా ఒరిజినాలిటీ బయటికొచ్చేది.

ఇప్పటివరకు ఉన్నంతలో బాబు గోగినేని, సామ్రాట్, భానుశ్రీ, అమిత్, రోల్ రైడా, దీప్తి నల్లమోతు, శ్యామల తమ తమ ఒరిజినల్ బిహేవియర్ తో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

ఇంకా హౌసులోకి ఎంటర్ కాని కొత్త హౌస్ మెంబర్ నందిని మిస్టీరియస్గా అనిపిస్తోంది.

ఫస్ట్ ఇంప్రెషన్లో కూల్ గా కనిపిస్తున్నా క్రమంగా ఆమె సైలెంట్ కిల్లర్ అవుతుందేమో అని అనుమానంగా ఉంది.

ముందు ముందు ఏమౌతుందో చూడడం కన్నా, ఎవరి మనస్తత్వాలు ఎలా మారతాయో గమనించడమే మనం చేయాల్సింది.ఏమో.ఏదైనా జరగొచ్చు!!!

ప్రతి వారాంతంలో నాని గారి ఓవరాల్ రివ్యూ చాలా బాగుంది.

తనలోని స్పాంటానిటీ, ఈజ్, సెన్సాఫ్ హ్యూమర్ అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని వెళ్తున్నాయి.ఈ కార్యక్రమానికి సీజన్#1 లో ఎన్.టి.ఆర్ ఎంత కరెక్టో సీజన్#2 కి నాని కూడా అంతే కరెక్ట్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube