ఏ హీరో చేయని పని పాతికేళ్ల క్రితమే వెంకటేష్ చేసి చూపించాడు. నిజంగా గ్రేట్

విక్టరీ వెంకటేష్ గురించి తెలియని వారు ఉండరు.తన నటనతో, హావభావాలతో అందరిని మెప్పించిన హీరో వెంకటేష్ అనే చెప్పాలి.

 Facts Behind Venkatesh Marrige With Neeraja Reddy-TeluguStop.com

ఆయన సినీ బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా పెద్దది.ఎందుకంటే వెంకటేష్ తండ్రి ఒక సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్.

మొదట్లో రామనాయడు కొడుకుగా సినీ రంగంలోకి వచ్చినాగాని వెంకటేష్ సొంత టాలెంట్ తో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని అభిమానులను సొంతం చేసుకున్నాడు.వెంకటేష్ నటనకు గాను తెలుగు ప్రేక్షకులు ఆయనకు విక్టరీ అనే టాగ్ కూడా ఇచ్చారు.

 Facts Behind Venkatesh Marrige With Neeraja Reddy-ఏ హీరో చేయని పని పాతికేళ్ల క్రితమే వెంకటేష్ చేసి చూపించాడు. నిజంగా గ్రేట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు టాప్ హీరోల లిస్ట్ లో ఉండే పేర్లలో వెంకటేష్ పేరు కూడా ఒకటి.తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల వర్గాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో విక్టరీ వెంకటేష్ .అంతేకాదు హీరోగా ఇప్పటిగా తనదైన శైలిలో, సరైన సినిమాలను ఎంచుకుని సినిమాలు తీస్తూ ప్రేక్షకుల మన్నలను పొందుతున్నాడు.అయితే విక్టరీ వెంకటేష్ కుటుంభంలో నుంచి సినీ రంగాల్లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు.

ఉదాహరణకు నాగ చైతన్య, రాణా.ఇలా వాళ్ళు కూడా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే.!

పాతికేళ్ల కిందటే కులాంతర వివాహం

సినీ ఇండస్ట్రీలో అంత గొప్ప పేరు, ప్రతిష్టలు ఉన్నాగాని వెంకటేష్ ఇన్నేళ్ల కెరీర్‌ లో తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ప్రేక్షకులకు అంతగా తెలియనివ్వలేదు.వెంకటేష్ భార్య, పిల్లలు గురించి ప్రేక్షకులకు తెలిసింది చాలా తక్కువ అని చెప్పాలి.ఎప్పుడు కూడా వెంకటేష్ భార్య గురించిగాని, పిల్లల గురించి గాని ప్రస్తావించిన సందర్భాలు లేవు.అలాగే ఆమెతో కలిసి ఎక్కడ పెద్దగా బయట కనిపించింది కూడా లేదు.

అయితే వెంకటేష్ వెన్నంటే ఉండి, తన కష్ట, సుఖాలలో తోడుగా నిలిచింది మాత్రం అతని భార్య  నీరజా రెడ్డి అని వెంకటేష్ సన్నిహిత వర్గాలు చెబుతుంటారు.ఈ మధ్యనే వారి కుటుంభంలో రానా, మిహికా బజాజ్ వివాహం జరిగిందన్న విషయం అందరికి తెలుసు.

అయితే ఆ అమ్మాయిని ఇంటర్ క్యాష్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు.కానీ వెంకటేష్ నీరజా రెడ్డిని ఎప్పుడో రెండున్నర దశాబ్దాల క్రితమే కులాంతర వివాహాం చేసుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు.

అంటే వెంకటేష్ ఒక రెడ్డి కుటుంభం నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.కానీ ఈ విషయం అందరికి తెలియదు.వెంకటేష్ భార్య గురించి తెలుసుకుంటే… నీరజా రెడ్డి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లిలో ఉంది.

రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కుటుంబం వీరిది.అంటే వెంకటేష్ ఒక రెడ్డి కుటుంభం నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.వెంకటేష్, నీరజ రెడ్డి వివాహం 1985 లో జరిగింది.

వెంకటేష్ 25 ఏళ్ల వయస్సులో నీరజ తో పెళ్లి జరిగింది.అంతేకాదు నీరజా రెడ్డి విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ కూడా పూర్తి చేసారు.

ఆ తర్వాత ఇద్దరు కుటుంబ  పెద్దలు వెంకటేష్, నీరజా రెడ్డిల పెళ్లిని ఘనంగా జరిపించారు.వీరి జంటకు మొత్తం నలుగురు పిల్లలు.

ముగ్గురు అమ్మాయిలు, ఒక బాబు.నీరజా రెడ్డి ఎప్పుడు కూడా నేను ఒక పెద్ద స్టార్ హీరో భార్యను అని గొప్పలకు పోయి లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేసేది కాదు.

చాలా సింపుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తూ ఉంటోంది.ఎప్పుడు వెంకటేష్ షూటింగ్ లని, సినిమాలని బిజీగా ఉంటారు.

దీంతో కుటుంబ బాధ్యతలను, పిల్లల బాధ్యతలను తనపై వేసుకొని కుటుంబాన్ని ఒక సరైన పద్దతిలో చక్కదిద్దడం నీరజా రెడ్డి స్పెషాలిటీ.ఇప్పటికీ ఇంట్లో ఉన్న తన నలుగురు పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటుంది.అంతేకాదు వారి చదువులో ఆమె పాత్రనే కీలకం అంట.ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా.అలానే వెంకటేష్ ఇంటికి మాత్రం నీరజారెడ్డి పాత్రనే కీలకం అనే చెప్పాలి.ఎంత పెద్దింటి కోడలైనా డాబు, దర్పం అనేవి ప్రదర్శించకుండా ఒక సామాన్యురాలిగానే కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తోంది నీరజా రెడ్డి.

అయితే వెంకటేష్ నటించిన ఏ సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్‌కు గాను, ఈవెంట్స్‌కు గాను ఆమె ఎప్పుడు కూడా వచ్చిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి.వెంకటేష్ విషయానికొస్తే.

ప్రస్తుతం ‘నారప్ప’ సినిమా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేస్తున్నాడు.

#VenkateshReal #VenkateshWife #Venkatesh Wife #FactsBehind #InterCaste

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు