కెరీర్ లో సక్సెస్ కోసం సుడిగాలి సుధీర్ పడిన కష్టాలు తెలుసా?

ఈటీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో సుడిగాలి సుధీర్ ఒకరు.ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం సుధీర్ కు సొంతం.

 Facts Behind Sudigali Sudheer Career Success, Sudigali Sudheer, Jabardasth, Sudh-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.తనపై ఇతరులు పంచ్ లు వేసినా వాటిని సరదాగానే తీసుకునే మృదు స్వభావి సుడిగాలి సుధీర్.

మొదట్లో జబర్దస్త్ షోకు మాత్రమే కమెడియన్ గా పరిమితమైన సుధీర్ తర్వాత పలు షోలకు యాంకర్ గా, సినిమాల్లో హీరోగా కూడా నటించారు.

వెండితెరపై స్టార్ హీరోలకు ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో బుల్లితెరపై సుడిగాలి సుధీర్ కు కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు.

అయితే సుధీర్ ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్న సుధీర్ వ్యక్తిగత విషయాలు, పడిన కష్టాలు చాలామందికి తెలియవు.1987, మే 19న సుధీర్ దేవ్, నాగరాణి దంపతులకు విజయవాడలో జన్మించారు.

Telugu Jabardasth, Sudheer Career, Vijayawada-Movie

సుధీర్ పూర్తి పేరు సుధీర్ ఆనంద్ బయానా.సుధీర్ కు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు.సుధీర్ ఇంటర్ చదివే సమయంలోనే స్టార్ మా ఛానల్ నిర్వహించిన స్టార్ హంట్ కార్యక్రమానికి హాజరై ఫైనల్స్ కు చేరుకున్నాడు.

అయితే ఫైనల్ లో మాత్రం సుధీర్ విజేత కాలేదు.సుధీర్ ఈ కార్యక్రమం కోసం ఇంటర్ పబ్లిక్ పరీక్షలను కూడా లెక్క చేయలేదు.దీనిని బట్టి సుధీర్ కు నటనపై ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.

చదువంటే పెద్దగా ఇష్టపడని సుధీర్ ఆ తరువాత ఎంతో కష్టపడి ఇంటర్ పాస్ అయ్యాడు.

బాల్యంలో మేనమామ దగ్గర సుధీర్ మ్యాజిక్ నేర్చుకున్నాడు.పలు టీవి షోలలో సుధీర్ తన మ్యాజిక్ టాలెంట్ ను ప్రదర్శించాడు.

తన తండ్రికి యాక్సిడెంట్ జరగడంతో మ్యాజిక్ షోలు చేసి సుధీర్ కుటుంబాన్ని పోషించాడు.సుధీర్ ఒక దశలో తినడానికి తిండి లేక కష్టాలు పడిన రోజులు కూడా ఉన్నాయి.

కెరీర్ లో ఎన్నో కష్టాలను అనుభవించి సుధీర్ గొప్ప స్థాయికి ఎదిగారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube