అక్కినేని నాగచైతన్య అన్నయ్య గురించి మీకు తెలుసా...?

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా తెరంగేట్రం చేసి వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుల్లో నాగచైతన్య ఒకరు.దగ్గుబాటి వెంకటేశ్ సోదరి లక్ష్మి, నాగార్జున సంతానం నాగచైతన్య.

 Facts About Naga Chaitanya Elder Brother, Daggubati Lakshmi, Naga Chaitanya Moth-TeluguStop.com

దగ్గుబాటి కుటుంబానికి చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్న నాగార్జున తర్వాత కాలంలో వివిధ కారణాల వల్ల విడిపోయారు.అనంతరం నాగార్జున అమలను వివాహం చేసుకోగా లక్ష్మి అమెరికాకు చెందిన శరత్ విజయ్ రాఘవ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

శరత్ విజయ్ రాఘవ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు.నాగ చైతన్య బాల్యమంతా తన తల్లి దగ్గరే గడిపాడు.

బాల్యం నుంచే సినిమాలపై ఆసక్తి ఉన్న నాగ చైతన్య తల్లి సూచనల మేరకు తండ్రి చెంతకు చేరి జోష్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.దగ్గుబాటి లక్ష్మి వివాహం చేసుకున్న శరత్ విజయ్ రాఘవకు కూడా అప్పటికే పెళ్లి జరిగింది.

శరత్ మొదటి భార్య కుమారుడు, నాగచైతన్య ఒకే ఇంట్లో పెరిగారు.

శరత్ విజయ్ రాఘవ లాగే ఆయన కుమారుడు కూడా బిజినెస్ మేన్ గా కొనసాగుతున్నాడు.

కొన్ని నెలల క్రితం శరత్ కుమారుని వివాహం జరిగింది.ఈ వివాహ వేడుకకు నాగచైతన్యతో పాటు సమంత కూడా హాజరైంది.

ఆ సమయంలో చైతన్య, సమంత పెళ్లి వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.లక్ష్మి, శరత్ కుమార్ వారి తొలి వివాహ జీవితంలో పుట్టిన కుమారులతో సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు.

నాగచైతన్య, సమంత వివాహానికి లక్ష్మి, ఆవిడ భర్త హాజరైన సంగతి తెలిసిందే.మజిలీ, వెంకీమామ సినిమాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్న నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నారు.

త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube