నాగబాబు ముందు రోజా ఎంత? జబర్దస్త్ నుంచి వైదొలగడానికి కారణం అదికాదట..

తెలుగు బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన షో జబర్దస్త్.ఈ ప్రోగ్రాంపై పైన, డబుల్ మీనింగ్ మాటలపైనా.

 Facts About Naga Babu And Roja In Jabardasth , Nagababu, Roja, Jabardasth, Comed-TeluguStop.com

పలు విమర్శలు వచ్చినా జనాదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.కొన్ని సంవత్సరాలుగా తెలుగు జనాలను తమ కామెడీతో అలరిస్తూనే ఉన్నారు జబర్దస్త్ ఆర్టిస్టులు.

అయితే ఈ షోకు చాలా కాలం రోజా, నాగబాబు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు.వీరిద్దరు జబర్దస్త్ ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు.

అయితే కొంతకాలం క్రితం ఈ షో నుంచి వెళ్లిపోయాడు నాగబాబు.అయితే ఈ సందర్భంగా తను బయటకు వెళ్లడానికి ఏవోవే కారణాలంటూ వార్తలు వచ్చాయి.

నాగబాబు కంటే రోజాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని.అందుకే ఈ షో నుంచి వెళ్లిపోయాడనే మాటలు వినిపించాయి.

తాజాగా జబర్దస్త్ విషయంలో నాగబాబు, రోజా లో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేదో వివరించాడు. ఆ షో ఆర్టిస్టు నవీన్.రోజా రెడ్డి, అలాగే మల్లెమాల అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డి.ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో నాగబాబు కంటే రోజాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని.

అందుకే ఈ షో నుంచి నాగబాబు తప్పుకున్నాడని అప్పల్లో వార్తలు వచ్చాయి.అయితే జబర్దస్త్ లో రోజా కంటే నాగబాబుకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని చెప్పాడు.

నాగబాబు చెప్పిన వారినే విన్నర్ గా ప్రకటించే వారని వెల్లడించాడు.నాగబాబు ఉన్నంత కాలం రోజాకు ఉన్న ఇంపార్టెన్స్ చాలా తక్కువ అన్నాడు.

జడ్జిమెంట్ విషయంలో నాగబాబే కీలక నిర్ణయం తీసుకునేదని చెప్పాడు.

Telugu @bayviewprojoffl, Comedians, Nagababu, Jabardast, Jabardasth, Judge, Nave

అంతేకాదు.జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా అప్పట్లో నాగబాబుకే ఎక్కువ భజన చేసేవారని చెప్పాడు.ప్రస్తుతం రోజాకు ఆ భజన మొదలైందన్నాడు.

అప్పుడు నాగబాబు, ఇప్పుడు రోజా జబర్దస్త్ జడ్జిలుగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నాడు.తనకు ఎక్కువ ప్రాధాన్యత లేకపోవడం వల్లే నాగబాబు బయకు పోయాడనే విషయం నూటికి నూరు శాతం తప్పు అని వెల్లడించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube