సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఆచరించమని చెప్పిన నోము ఏమిటో తెలుసా?

Facts About Maredu Dalam Nomu

హిందూ పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరునికి మారేడు దళాలు అంటే ఎంతో ప్రీతికరమైనది.ఈ మారేడు దళాలతో స్వామివారిని పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పకుండ కలుగుతుందని చెప్పవచ్చు.

 Facts About Maredu Dalam Nomu-TeluguStop.com

స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఈ మారేడు దళాల నోము స్వయంగా పార్వతీపరమేశ్వరులు ఆచరించమని చెప్పడం వల్ల ఈ నోముకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

పూర్వం ఒక రాజుకు ఉన్న ఒకానొక కొడుకు ఆయుష్షు తీరి మరణం పొందుతాడు.

 Facts About Maredu Dalam Nomu-సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఆచరించమని చెప్పిన నోము ఏమిటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ రాజుకు తన కొడుకు శవాన్ని ఒంటరిగా పంపించడం ఇష్టంలేక తన కొడుకు శవంతో పాటు ఒకరు తోడుగా వెళ్లడానికి ఎవరినైనా తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు.రాజభటులు ఎంత తిరిగినా తన కొడుకుతో పాటు వెళ్లడానికి ఎవరు ఇష్టపడరు.

కానీ ఓ సవతి తల్లి తన సవతి కూతురిని రాజు కొడుకు శవం వెంట తోడుగా పంపడానికి సిద్ధపడుతుంది.అయితే ఆ సవతి తల్లి తన కూతురు ఎత్తున డబ్బు తీసుకొని పంపించడానికి అంగీకరించింది.

ఆ తల్లి అడిగినంత డబ్బులు రాజు ఇచ్చి తన కూతురిని తన కొడుకు శవంతో పాటు కట్టేసి స్మశానానికి తీసుకు వెళ్తున్న సమయంలో భయంకరమైన చీకటి కమ్ముకుని పెద్ద వర్షం కురిసింది.ఆ వర్షంలో ఎవరూ ముందుకు వెళ్ళలేని పరిస్థితులలో రాజు కొడుకు శవంతో పాటు ఆ పిల్లను కూడా అక్కడే వదిలి ఎవరికి వారు ఇంటికి వెళ్లారు.

ఈ క్రమంలోనే బాలిక కట్లు వూడదీసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆలయం లోపలికి వెళ్లి పార్వతీ పరమేశ్వరుల ముందు తన పరిస్థితిని తెలియజేస్తూ ఏడవసాగింది.

కరుణామయులైన ఆదిదంపతులు ఆ బాలికను అనుగ్రహించి కొన్ని అక్షింతలు, జలాన్ని ఇచ్చి ఇవి రాజకుమారుడు శవంపై చల్లి మారేడు దళాలతో నోము ఆచరించమని తెలిపారు.

పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞ మేరకు బాలిక మారేడు దళములు నోమునోచి అక్షింతలు, జలాన్ని రాజకుమారుడు శవంపై చల్లడం వల్ల అతడు ప్రాణాలతో లేచాడు.మరుసటి రోజు ఉదయం శవాలకు అంత్యక్రియలు నిర్వహించాలని వచ్చిన రాజు అతని భటులకూ తన కొడుకు ప్రాణాలతో ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యపోయి ఆ బాలికతోనే తన వివాహాన్ని అంగరంగవైభవంగా జరిపించారని పురాణ గాథలు చెబుతున్నాయి.

ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు శయన మారేడు దళం నోము ఆచరించాలని తెలిపారు.

#Lard Shiva #Parvathi #Maredu Dalam #Nomu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube