తెలంగాణ కంచి ఎక్కడ ఉంది.. ఆ ఆలయ ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం?

సాధారణంగా కంచిలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం కోసం చాలామంది భక్తులు కంచి అమ్మవారి ఆలయానికి వెళుతుంటారు.అదేవిధంగా కంచిలో ఉన్నటువంటి బంగారు వెండి బల్లిని దర్శనం చేసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి బల్లి దోషాలు ఉండవు అని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు.

 Facts About Kodakanchi Sri Adinarayana Swamy Temple Kodakanchi, Sir Adinarayana-TeluguStop.com

అయితే అచ్చం కంచిలోని ఆలయంలో చేసే పూజా విధానాలు అక్కడ ఉన్నటువంటి బంగారు వెండి బల్లి విగ్రహాలు కూడా మన తెలంగాణలో ఉన్నాయి.అందుకే తెలంగాణ లో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని తెలంగాణ కంచి క్షేత్రంగా భావిస్తారు.

మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో పచ్చని పొలాల మధ్య శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి ఆలయం ఉంది.

ఈ ఆలయం అనేక విశిష్టతను సంతరించుకుంది.ఈ ఆలయంలోని విగ్రహాలను ప్రతిష్టించినప్పటినుంచి అచ్చం కంచి తరహాలోనే పూజలు జరుగుతుంటాయి.అందుకే కంచి కి వెళ్ళలేకున్నా కొడకంచికి వెళ్లాలని అప్పట్లో చెప్పేవారు.ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్న కంచిలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్న ఒకే ఫలితం ఉంటుందని చెప్పవచ్చు.

Telugu Bhudevi, Jinnaram, Kodakanchi, Sanga, Siradinarayana, Sridevi-Telugu Bhak

ఆలయ చరిత్ర విషయానికి వస్తే అల్లాణి వంశస్తుడైన రామోజీరావుకు స్వామివారు కలలోకి వచ్చి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహంఉందని ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి కొడకంచి గ్రామంలోని అటవీ ప్రాంతంలో కొండపై ప్రతిష్టించాలని చెప్పారు.ఈ క్రమంలోనే అల్లాన్ని వంశస్థులు ఈ విగ్రహాన్ని తీసుకువచ్చి కొండపై నుంచి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.అదేవిధంగా కొడకంచి ఆదినారాయణస్వామి ఆలయంలో కూడా కంచిలో మాదిరిగానే బంగారు వెండి బల్లి విగ్రహాలు ఉన్నాయని, ఈ విగ్రహాలను దర్శించడం వల్ల ఎలాంటి బల్లి దోషాలు ఉండవని,ఈ బల్లులను దర్శిస్తే సాక్షాత్తు కంచి క్షేత్రాన్ని దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube