సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ ఘనత దక్కించుకుంది కేవలం ప్రభాస్ మాత్రమే

ప్రభాస్.తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన నటుడు.

 Facts About Hero Prabhas On His Birthday, Prabhas, Prabahs Birthday, Prabhas Baa-TeluguStop.com

తొలుత లవర్ బాయ్ గా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ కుర్రాడు.నెమ్మదిగా మాస్ హీరోగా మారిపోయాడు.

అతి తక్కువ కాలంలోనే వంద కోట్ల మార్కెట్ ను సంపాదించుకోగలిగాడు.తెలుగులో ఒకప్పుడు ఎన్టీఆర్.

ఇప్పుడు ప్రభాస్.టాలీవుడ్ సత్తాను పెంచిన హీరోలుగా చెప్పుకోవచ్చు.

తెలుగులో 150 కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్ ను ఏకంగా 2 వేల కోట్ల రూపాయలకు పెంచిన ఘనత ప్రభాస్ కే దక్కింది.ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు అంటే తెలుగు హీరోలు ఎంతో గొప్పగా చూసేవారు.

ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ హీరోలను మించిన బడ్జెట్ తో బాలీవుడ్ టాప్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు.తెలుగులో పుట్టిన ఈ పాన్ ఇండియన్ హీరో బర్త్ డే ఇవ్వాళ.

ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Prabhas, Prabahs, Prabhas Nature-Telugu Stop Exclusive Top Stories

ప్రభాస్ చాలా మంచి భోజన ప్రియుడు.తన ఇంటికి వచ్చే అతిథులకు ఎంతో గౌవరం ఇస్తాడు.చక్కటి భోజనం తినిపిస్తాడు.

సినిమా షూటింగ్ కు కూడా ఇంటి నుంచి క్యారేజీలు తెప్పిస్తాడు.అంటే ఆయన వంట రుచి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి తాను హీరో కాకుంటే రెస్టారెంట్ బిజినెస్ చేసేవాడిని అని చెప్పాడు ప్రభాస్.ఇక ప్రభాస్ సినిమా కెరీర్ విషయానికి వస్తే తన పెదనాన్న కృష్ణంరాజు స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాడు.

ఈశ్వర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు.ఈ సినిమా ఆడలేదు.

ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర కూడా ఫ్లాప్ అయ్యింది.అదే సమయంలో వర్షం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.

ఈ సినిమాతో కనీవినీ ఎరుగని రీతిలో జనాదరణ పొందాడు ప్రభాస్.

Telugu Prabhas, Prabahs, Prabhas Nature-Telugu Stop Exclusive Top Stories

ఆ తర్వాత వచ్చిన ఛత్రపతి సినిమాతో టాప్ హీరోగా మారిపోయాడు.ఈ సినిమా హిట్ తర్వాత ఆయన వెను తిరిగి చూసుకోలేదు.ఆ తర్వాత వచ్చిన బుజ్జిగాడు సినిమా కూడా ఫర్వాలేదు అనిపించింది.

బిల్లా సినిమాలో హాలీవుడ్ హీరో లుక్ తో అదరగొట్టాడు.డార్లింగ్, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, మిర్చి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడ.

ఇక బాహు బలి సినిమాతో ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చూపించాడు.ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా మారి రాధేశ్యామ్, ఆదిపురుష్, స్పిరిట్‌ సినిమాలు చేస్తున్న ప్రభాస్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube