నాని అక్క పెద్ద డైరెక్టర్ అని మీకు తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు.సినిమాలపై ఎంతో ఆసక్తితో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ను ప్రారంభించారు.

 Unknown Facts About Hero Nani Sister Deepthi, Deepthi Ganta, Nani Sister, V Film-TeluguStop.com

తర్వాత అష్టా చమ్మా సినిమా ద్వారా హీరోగా పరిచయమైన నాని ఎంతో నాచురల్ గా తన పాత్రలో నటించి అందరి ఆదరణ పొందాడు.తను నటించిన మొదటి సినిమా హిట్ అవడంతో నానికి వరుస అవకాశాలు వచ్చాయి.

నాని ప్రతి సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించారు.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది.బలే బలే మగాడివోయ్, జెర్సీ ఇలా వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నాని గురించి మనకు తెలిసినదే.అంతేకాకుండా నాని ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

నాని నిర్మాతగా వ్యవహరించిన “అ!” సినిమా మంచి విజయాన్ని అందుకుంది.కానీ నాని అక్క ఒక డైరెక్టర్ అని మీకు తెలుసా? నాని అక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించారు.

Telugu @mail2ganta, Deepthi Ganta, Nani Sister, Short, Nanisister-Movie

యూట్యూబ్ ఛానల్ లో దర్శకత్వం వహించిన అనగనగా ఒక్క నాన్న అనే షార్ట్ ఫిలిం మంచి విజయం సాధించడంతో , తన అక్కలో ఉన్న ప్రతిభను గుర్తించిన నాని తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా తన అక్కను దర్శకురాలిగా వెండితెరపై పరిచయం చేయబోతున్నాడు.తన అక్క దర్శకురాలిగా తెరకెక్కించే సినిమాలో నాని హీరోగా నటిస్తున్నాడా? లేదా ?అన్న విషయం తెలియటం లేదు.

ఇకపోతే నాని తాజాగా నటించిన “వి” సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా విడుదలైన సంగతి మనకు తెలిసినదే.అయితే ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ప్రస్తుతం నాని చేతిలో మూడు సినిమాలు ఉండడంతో ఈ సినిమాలపై నాని భారీ అంచనాలను పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube