ఫ్యాక్టరీల కప్పులపై గుండ్రంగా తిరిగే గోపురాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

చాలా మందికి ఫ్యాక్టరీలలో ఉపయోగించే కొన్ని వస్తువుల వల్ల కలిగే ఉపయోగాలు తెలీయవు.అసలు వాటిని ఎందుకు ఏర్పాటు చేశారో తెలియక ఆ అనుమానాన్ని మధ్యలోనే కట్టడి చేసుకుంటారు.

 Factories Up Side Turbo Ventilator Factory Roofs Viral News-TeluguStop.com

ఇంతకీ ఇప్పుడు వీటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.మనం ఫ్యాక్టరీలపై గమనిస్తే పైకప్పులపై స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన చిన్న గోపురాలను ఏర్పాటు చేసి ఉంటారు.

సూర్యని వెలుగులో ఇవి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంటాయి.ఫ్యాక్టరీలపై ఉన్న ఈ గోపురాలు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి.

 Factories Up Side Turbo Ventilator Factory Roofs Viral News-ఫ్యాక్టరీల కప్పులపై గుండ్రంగా తిరిగే గోపురాలు ఎందుకు ఉంటాయో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా ఈ గోపురాలను ఎందుకు ఏర్పాటు చేస్తారో ఎవ్వరికి తెలియదు.ఇప్పుడు మనం వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసుకుందాం.

ఫ్యాక్టరీలపై ఉండే ఈ గోపురంలాంటి పరికరాన్ని టర్బో వెంటిలేటర్ అని పిలుస్తారు.ఇది కర్మాగారాల పైకప్పులపై తిరిగే గోపురంలా కనిపిస్తుంది.

ఇది ఎయిర్ వెంటిలేటర్, టర్బైన్ వెంటిలేటర్, రూఫ్ ఎక్స్‌ట్రాక్టర్ వంటి అనేక పేర్లతో కూడా పిలువబడుతుంది.ప్రస్తుతం టర్బో వెంటిలేటర్లను కర్మాగారాలు, పెద్ద దుకాణాలలో మాత్రమే కాకుండా, ఇతర ప్రాంగణాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు.

వీటిని ప్రస్తుతం రైల్వే స్టేషన్ల పైకప్పులపై కూడా ఏర్పాటు చేస్తున్నారు.పైకప్పులపై అమర్చిన టర్బో వెంటిలేటర్ మితమైన వేగంతో నడుస్తుంది.కర్మాగారాలు లేదా క్యాంపస్‌ లోపలి వేడి గాలులను పైకప్పు ద్వారా బయటికి పంపించడం వీటి ప్రధాన పని.ఇది వేడి గాలులను వెంటిలేట్ చేసినప్పుడు కిటికీలు, తలుపుల నుంచి వచ్చే తాజా సహజమైన గాలులు ఫ్యాక్టరీలలో ఎక్కువసేపు ఉంటాయి.ఇది ఉద్యోగులకు చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది.టర్బో వెంటిలేటర్ వేడి గాలులతో పాటు కర్మాగారాల నుంచి వచ్చే వాసనను పోగొట్టడానికి పనిచేస్తుంది.ఇది మాత్రమే కాదు వాతావరణం మారినప్పుడు లోపల ఉన్న తేమను కూడా బయటకు తీస్తుంది.అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ గోపురాలను చాలా ఆఫీసుల్లో, కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం ఇప్పుడు సర్వసాధారణమైంది.

#Factories #Factory Roofs #Up Side

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు