ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టైన సినిమాలు ఇవే?

ఈ మధ్య కాలంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తగ్గినా కొన్నేళ్ల క్రితం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

 Faction Back Drop Hit Movies In Tollywood Industry Details, Details Her, Faction-TeluguStop.com

బాలయ్య హీరోగా బి.గోపాల్ డైరెక్షన్ లో సమరసింహారెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

1999 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన సమరసింహారెడ్డి సినిమా విడుదలైంది.కేవలం 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య, సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన మరో సినిమా నరసింహ నాయుడు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది.వెంకటేష్ హీరోగా తెరకెక్కిన జయం మనదేరా, చిరంజీవి ఇంద్ర, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి విజయాలను అందుకున్నాయి.

Telugu Aadi, Aravind Sametha, Drop, Indra, Jayam Manadera, Simha, Samba, Tollywo

ఈ సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడం గమనార్హం.బాలయ్య చెన్నకేశవరెడ్డి, రాజశేఖర్ భరతసింహారెడ్డి సినిమాలు కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.వినాయక్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సాంబ సినిమా సైతం యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

ఆ తరువాత ఫ్యాక్షన్ సినిమాల హవా తగ్గింది.

Telugu Aadi, Aravind Sametha, Drop, Indra, Jayam Manadera, Simha, Samba, Tollywo

చాలా సంవత్సరాల తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అరవింద సమేత సినిమా తెరకెక్కగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ రిజల్ట్ ను ఎందుకుంది.తారక్ కెరీర్ లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే కావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube