ఫ్యాక్ట్ చెక్ వివాదం: ట్రంప్‌ Vs ట్విట్టర్.. ఉద్యోగులతో వద్దు, నేను రెడీ అంటున్న సీఈవో  

ఫ్యాక్ట్ చెక్ వివాదం: ట్రంప్‌ Vs ట్విట్టర్.. ఉద్యోగులతో వద్దు, నేను రెడీ అంటున్న సీఈవో - Telugu \"leave Our Employees Out Of It\", Twitter Ceo Jack Dorsey, Twitter Ceo Jack Dorsey Hits Back At President Trump, Twitter Vs Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ల మధ్య ఫ్యాక్ట్ చెక్ వ్యవహరం పెను వివాదానికి దారితీసింది.

 Factcheck Twitter Vs Trump America

అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్లతో అవకతవకలు జరిగే అవకాశం ఉందని ట్రంప్ చేసిన ట్వీట్ ఇంతటి దుమారానికి కారణమైంది.ఆయన చేసిన రెండు ట్వీట్లకు కింద ట్విట్టర్ ఫ్యాక్ట్ ‌చెక్ అనే ట్యాగ్‌ను తగిలించింది.
ఇది ట్రంప్‌కు కోపం తెప్పించింది.దీనిపై గంటల వ్యవధిలోనే రియాక్ట్ అయిన అగ్రరాజ్యాధినేత ట్విట్టర్‌పై విరుచుకుపడ్డారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ జోక్యం చేసుకుంటోందన్న ట్రంప్… మెయిల్ ఇన్ బ్యాలెట్లపై తన వ్యాఖ్యలు సరికావని వాళ్లు చెబుతున్నారని మండిపడ్డారు.అసత్య వార్తలు ప్రసారం చేసే సీఎన్ఎన్, అమెజాన్, వాషింగ్టన్ పోస్టులను ఆధారంగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోమంటున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిగ్ యాక్షన్ ఉండబోతోందని ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు.భావ వ్యక్తీకరణకు టెక్ కంపెనీలు అడ్డుపడుతున్నాయని.

ఫ్యాక్ట్ చెక్ వివాదం: ట్రంప్‌ Vs ట్విట్టర్.. ఉద్యోగులతో వద్దు, నేను రెడీ అంటున్న సీఈవో-Telugu NRI-Telugu Tollywood Photo Image

అలా జరిగే లోపే వాటిని కట్టడి చేసేందుకు లేదా మూసివేసేందుకు ఓ చట్టం తీసుకురావాలని యోచిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.

అధ్యక్షుడి వ్యాఖ్యలపై ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే స్పందించారు.ఓ కంపెనీగా, సంస్థ చర్యలకు ఎవరో ఒకరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.అందుకు తాను సిద్ధమని ప్రకటించారు.

ఇదే సమయంలో ట్విట్టర్ ఉద్యోగులను ఈ వివాదంలోకి లాగొద్దని.జాక్ డోర్సే కోరారు.

ఏది ఏమైనా ట్విట్టర్ కొనసాగుతుందని… ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల గురించి తప్పుడు వార్తలు లేదా వివాదాస్పద సమాచారాన్ని ఎత్తి చూపుతూనే ఉంటుందని జాక్ స్పష్టం చేశారు.తమ ఉద్దేశ్యం విరుద్ధమైన ప్రకటనలను గుర్తించి, వివాదంలో ఉన్న సమాచారాన్ని ఎత్తిచూపడం మాత్రమేనని ట్విట్టర్ సీఈవో తెలిపారు.

పారదర్శకంగా సేవలు అందించడం తమ లక్ష్యమని జాక్ డోర్సే అన్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Factcheck Twitter Vs Trump America Related Telugu News,Photos/Pics,Images..