ముఖం మీద అవాంఛిత జుట్టును తొలగించటానికి పసుపు పాక్స్  

  • జుట్టు అనేది అమ్మాయిలకు అందాన్ని ఇస్తుంది. అయితే అదే జుట్టు ముఖం మీద ఉంటే అవాంఛిత రోమాలు అని అంటారు. ఈ సమస్య కారణంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యకు ఖరీదైన కాస్మొటిక్స్ ఏమి వాడవలసిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ సమస్యను పసుపు సమర్ధవంతంగా పరిష్కారం చూపుతుంది. పసుపును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము.

  • Facial Hair Removeal Packs-

    Facial Hair Removeal Packs

  • ఒక స్పూన్ పసుపులో పాలు పోసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో రాసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ వెంట్రుకలు ఎక్కువగా ఉంటే శనగపిండిలో బియ్యంపిండి,పసుపు వేసి నీటిని కలిపి పేస్ట్ గా చేసి ముఖానికి రాసి 5 నిముషాలు అయ్యాక స్క్రబ్ చేయాలి.

  • Facial Hair Removeal Packs-
  • ఒక స్పూన్ శనగపిండిలో,చిటికెడు పసుపు, పాలను పోసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

  • బంగాళాదుంపలో సహజసిద్ధమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన అవాంఛిత రోమాలను తగ్గించటంలో చాల సమర్ధవంతంగా పనిచేస్తుంది. కందిపప్పును రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ లో బంగాళాదుంప జ్యుస్ ,నిమ్మరసం,తేనే కలిపి ముఖానికి రాసి పావుగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.