‘‘ జడ్జ్, జ్యూరీ, ఎగ్జిక్యూషనర్’’... అంతా ఫేస్‌బుక్, యూట్యూబ్‌లే: వ్యాక్సిన్‌ దుష్ప్రచారంపై వైట్‌హౌస్ ఆగ్రహం

ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఏకంగా వాటిని ‘‘కిల్లర్స్ ’’ అని అన్యాయంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాయని బైడెన్ గద్దించారు.

 Facebook, Youtube judge, Jury And Executioner On Vaccine Misinformation White Ho-TeluguStop.com

వ్యాక్సిన్లపై దుష్ప్రచారం వల్ల మహమ్మారిపై పోరాడటం, ప్రాణాలను కాపాడటం క్లిష్టంగా మారుతోందని బైడెన్, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ, అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఆరోపించిన సంగతి తెలిసిందే.దేశాన్ని కరోనా ఫ్రీ చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలకు సామాజిక మాధ్యమాలు తీవ్ర అవరోధాలుగా మారాయి.

ప్రస్తుత పరిస్ధితుల్లో వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రజలను వైరస్ బారి నుంచి రక్షించగలదని భావించారు బైడెన్.కానీ సోషల్ మీడియాలో టీకాలపై రకరకాల పుకార్లు వ్యాపిస్తుండటంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు వారు భయపడుతున్నారు.దీంతో ప్రభుత్వ ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడుతోంది.తాజాగా సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, యూట్యూబ్‌పై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ మండిపడింది.టీకాపై తప్పుడు సమాచారం వ్యాప్తిపై తాము ఎంత చెబుతున్నా ఈ రెండు సంస్థలు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ.

ఫేస్‌బుక్, యూట్యూబ్‌లే వారి ఫ్లాట్‌ఫామ్‌లకు సంబంధించినంత వరకు జడ్జి, జ్యూరీ, ఎగ్జిక్యూషనర్ అంటూ వ్యాఖ్యానించారు.కోవిడ్ వ్యాక్సిన్లు పనికిరానివని, మహిళల సంతానోత్పత్తికి హానీ కలిగిస్తుందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది.

సెంటర్ ఫర్ కౌంటర్ డిజిటల్ హేట్ (సీసీడీహెచ్) నుంచి ఇటీవల వచ్చిన ఒక నివేదికలో 12 ఖాతాలు ఆన్‌లైన్‌లో టీకాపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు తేలింది.ఈ ఆరు ఖాతాల నుంచి ఇప్పటికీ యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ అవుతున్నాయి.

ఆ ఖాతాల నుంచి నిరాధారమైన సమాచారం వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సదరు అధికారి కోరారు.

కోవిడ్ 19పై తప్పుడు సమాచారాన్ని అరికట్టడం గురించి ఫిబ్రవరిలో వైట్‌హౌస్.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.మరోవైపు ఈ వ్యవహారంపై యూట్యూబ్ ప్రతినిధి ఎలెనా హెర్నాండెజ్ మాట్లాడుతూ.

మార్చి 2020లో కోవిడ్ 19పై తప్పుడు సమాచారంతో వున్న 9,00,000 వీడియోలను కంపెనీ తొలగించిందని చెప్పారు.సీసీడీహెచ్ నివేదికలో గుర్తించిన వ్యక్తుల ఛానెళ్లను సైతం రద్దు చేసినట్లు ఎలెనా పేర్కొన్నారు.

వీడియోలోని కంటెంట్ ఆధారంగా తమ చర్యలు వున్నట్లు చెప్పారు.నివేదికలో పేర్కొన్న మిగిలిన ఛానెల్స్ తమ విధానాలను ఉల్లంఘించినట్లయితే వారి ఖాతాలను శాశ్వతంగా బ్లాక్ చేస్తామని ఆమె తెలిపారు.

Telugu Americansurgeon, Biden, Counter Hate, Elena Hernandez, Youtube, Youtube J

ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి కెవిన్ మెక్ అలిస్టర్ మాట్లాడుతూ.కోవిడ్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 18 మిలియన్లకు పైగా తప్పుడు సమాచారాన్ని తమ కంపెనీ తొలగించినట్లు వెల్లడించారు.అలాగే వైట్‌హౌస్ పదే పదే.తమ వైపు వేలు చూపించడం ఆపాలని ఫేస్‌బుక్ తన బ్లాగ్‌లో రాసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube