ఫేస్ బుక్ పై వాల్ స్ట్రీట్ మరో సంచలనం ? ఈసారి ఆధారాలతో ?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ ట్రెండ్ నడుస్తోంది.ఫేస్ బుక్ పై ప్రజల్లో ఆదరణ పెరిగిన తరువాత ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఆదరణ ప్రపంచవ్యాప్తంగా బాగా తగ్గిపోయింది.

 Wall Street Sensational Article On Facebook, Facebook, Wal Street Journal, Congr-TeluguStop.com

ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా, వెంటనే ఫేస్ బుక్ లో దానికి సంబందించిన అన్ని వివరాలు సమగ్రంగా జనాలకు తెలిసిపోతున్నాయి.ఎవరికి వారు వ్యక్తిగతంగా సమాచారాన్ని ఇతరులతో పంచుకునేందుకు దీనిని వేదికగా వాడుకుంటూ ఉండడంతో ఈ స్థాయిలో ఆదరణ లభిస్తోంది.

కాకపోతే కొంతకాలంగా ఫేస్ బుక్ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతూ వస్తోంది.

ఒకవైపు క్రేజ్ పెరుగుతున్నా, మరోవైపు రాజకీయ వివాదాల్లో చిక్కుకుని వివాదాస్పదమవుతోంది.

కొద్దిరోజుల క్రితం అమెరికాకు చెందిన  వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వివాదాస్పద కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.భారత్ లో ఫేస్ బుక్ బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తోందని, బిజెపి నాయకుల కనుసన్నల్లో పనిచేస్తూ ఆ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, వారు ఫేస్ బుక్ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నా, వారి విషయంలో పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తోంది అంటూ తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారాన్ని ఉదాహరణగా చూపించి ఫేస్ బుక్ అనేక ఆరోపణలు చేస్తూ కథనాన్ని ప్రచురించడంతో, దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

Telugu Ankitha Das, Congress, India-Political

ముఖ్యంగా ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకిత దాస్ పై అనేక ఆరోపణలు చేసింది.ఇది ఇలా ఉండగా, తాజాగా మరో సంచలన కథనాన్ని వెలుగులోకి తెచ్చింది.అంకిత దాస్ పై తాము ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయలేదని చెబుతూ, కొన్ని సాక్షాలను సైతం వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది.ఫేస్ బుక్ తన పాలసీకి భిన్నంగా, బీజేపీ ద్వేష పూరితమైన ప్రసంగాలతో అంకిత దాస్ వ్యవహరించిన తీరుపై ఆరోపణలు చేసింది.దీనికి సంబంధించి 2014లో బిజెపి గెలుపునకు ముందురోజ  అంకిత దాస్ పంపిన ఒక సందేశాన్ని ఈ సందర్భంగా బయటపెట్టింది.” మేము సోషల్ మీడియాలో ప్రచారాన్ని ప్రారంభించాం, ఆ తర్వాత ఏం జరిగిందన్నది చరిత్రే” అంటూ ఆమె పోస్ట్ పెట్టినట్లుగా వాల్స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

అలాగే భారత్ లో సోషలిజాన్ని పెకిలి వేయడానికి 30 ఏళ్ల సమయం పట్టింది అంటూ ఆమె పోస్ట్ పెట్టినట్లుగా వాల్ స్ట్రీట్ కథనం  ప్రచురించడంపై ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.ఇప్పటికే కాంగ్రెస్ ఫేస్ బుక్ బిజెపి కి అనుకూలంగా వ్యవహరిస్తోంది అంటూ అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో, తాజా వాల్ స్ట్రీట్ కథనం కాంగ్రెస్ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube