ఫేస్ బుక్ వినియోగదారులకు శుభవార్త - ఆకట్టుకునే ఫీచర్  

Facebook To Test Video Offline Option On July 11th In India-

యువత డైలీ రొటీన్ లో ఫేస్ బుక్ కూడా ఓ భాగం.ఇది కేవలం స్నేహితులు ఒకరితో ఒకరు టచ్ లో ఉండటానికి మొదలై, నేడు అతిపెద్ద సమాచార కేంద్రాల్లో ఒకటిగా ఎదిగింది.దేశ ప్రధాని అయినా, ఫేస్ బుక్ ద్వారానే ప్రజల్లోకి వస్తున్నాడు.అంతలా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఫేస్ బుక్, ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వినియోగదారులకి అందిస్తూ, ప్రజలు ఫేస్ బుక్ కి రిప్లేస్‌మెంట్ ని వెతుక్కోకుండా చేస్తోంది.

Facebook To Test Video Offline Option On July 11th In India---

కొంతకాలం క్రితం మొదలుపెట్టిన సరికొత్త వీడియో ఫీచర్ మంచి సక్సెస్ ని రుచిచూసింది.సినిమావాళ్ళు కూడా అటు యూట్యుబ్ తో పాటు, ఇటు ఫేస్ బుక్ లో కూడా విడియాల ద్వారా సినిమా ప్రచారం చేస్తున్నారు.

ఇక యూట్యూబ్ కి మరో షాక్ ఇస్తూ, యూట్యూబ్ దగ్గర ఉన్న మరో ఆప్షన్ ని తన వినియోగదారులకు కూడా అందించబోతోంది ఫేస్ బుక్.అదే ఆఫ్ లైన్ వీడియో.మీకు తెలిసిన విషయమే.యూట్యూబ్ ఆప్ లో నచ్చిన వీడియోని ఆఫ్ లైన్ మోడ్ లోకి డౌన్లోడ్ చేసుకోని చూడాలనిపించిన ప్రతీసారి, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా చూడొచ్చు.

ఇలాంటి ఆప్షన్ ఫేస్ బుక్ విడియోలకి లేకపోవడం ఇన్నిరోజులు ఫేస్ బుక్ వినియోగదారులకి తలనొప్పిగా మారింది.అయితే ఇప్పుడు ఫేస్ బుక్ కూడా విడియోలకి ఆఫ్ లైన్ ఆప్షన్ ని అందించబొతోంది.

జులై 11న భారతదేశంలోని కొందరు వినియోగదారులకి ఈ ఆప్షన్ ని అందించి ప్రయోగం చేయనుంది ఫేస్ బుక్.దానికొచ్చే రెస్పాన్స్ ని బట్టి విడియో ఆఫ్ లైన్ మోడ్ కి చేయాల్సిన మార్పులు చేర్పులు చేసి, పూర్తిస్థాయిలో విడియో ఆఫ్ లైన్ ఆప్షన్ ని అందుబాటులోకి తేవాలని ఫేస్ బుక్ ప్లాన్.