ట్రంప్‌కు ఫేస్‌బుక్ నుంచి ఊరట: నిషేధం జీవితకాలం కాదు.. రెండేళ్లే..!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫేస్‌బుక్ శుభవార్త చెప్పింది.ఆయన ఖాతాపై రెండేళ్ల నిషేధం విధించింది.

 Facebook Suspends Former Us President Donald Trump's Account For Two Years, Whit-TeluguStop.com

ఇది శుభవార్త ఎలా అవుతుంది అంటారా.? దీనికి వెనుక చాలా పెద్ద కారణం వుంది.నిజానికి ఆయన చేసినదానికి ఫేస్‌బుక్ జీవితకాల నిషేధం విధించే దిశగా అడుగులు వేసింది.కానీ పలు కారణాల వల్ల వెనక్కి తగ్గి రెండేళ్ల బ్యాన్‌తో సరిపెట్టింది.ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే.అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.

క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.

భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.

బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.

వారిని శాంతింపజేసేందుకు భద్రతా దళాలు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనతో ట్రంప్ వ్యవహారశైలిపై అమెరికన్లు భగ్గుమన్నారు.చట్టసభ సభ్యులైతే జనవరి 20కి ముందే పదవిలోంచి దించాలని పావులు కదిపారు.

ఇదే సమయంలో తమ నిబంధనలు ఉల్లంఘించారంటూ సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ట్రంప్ ఖాతాను బ్లాక్ చేశాయి.అయితే వీటిలో ఒక అడుగు ముందుకేసిన ట్విట్టర్ ఆయన ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.

Telugu Joe Biden, Nick Clegg, Board, Tear Gas, Trump, Whitesecretary-Telugu NRI

దీనిపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా ఆ సంస్థలు వెనక్కి తగ్గలేదు.కొద్దిరోజుల క్రితం ట్రంప్ ఫేస్‌బుక్ ఖాతాను స్తంభింపజేయడం సరైన నిర్ణయమేనని ఆ సంస్థకు చెందిన స్వతంత్ర పర్యవేక్షక సంస్థ ‘ఓవర్ సైట్ బోర్డు’ స్పష్టం చేసింది.అయితే, మాజీ అధ్యక్షుడి ఖాతాను నిరవధికంగా నిలిపివేసేందుకు అనుమతించాలన్న ఫేస్‌బుక్ అభ్యర్థనను మాత్రం బోర్డ్ డైరెక్టర్ థామస్ తోసిపుచ్చారు.ఫేస్‌బుక్ ఏళ్లుగా పాటిస్తున్న నిబంధనలు, పాలసీలకు విరుద్ధంగా ట్రంప్ ఖాతాపై సస్పెన్షన్‌ను శాశ్వతంగా కొనసాగించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆరు నెలల తర్వాత గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని థామస్ సూచించారు.

Telugu Joe Biden, Nick Clegg, Board, Tear Gas, Trump, Whitesecretary-Telugu NRI

ఆయన సూచన మేరకు సమీక్ష జరిపిన ఫేస్‌బుక్.ట్రంప్ ఖాతాను 2023 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు కంపెనీ వరల్డ్‌ వ్యవహారాల ఉపాధ్యక్షుడు నిక్‌ క్లెగ్ పేర్కొన్నారు.కష్టతరమైన కంటెంట్‌పై స్వతంత్రంగా పర్యవేక్షించేందుకు ఫేస్‌బుక్‌ పర్యవేక్షణ బోర్డును ఏర్పాటు చేసి, నిధులు సమకూర్చింది.

దీనికి సంబంధించి ఇప్పటి వరకు ట్రంప్‌ సస్పెన్షన్‌ అత్యంత ఉన్నత స్థాయి కేసు.మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడి ఖాతాను ఫేస్‌బుక్‌ రెండేళ్ల పాటు నిషేధించడంపై వైట్‌హౌస్‌ సెక్రెటరీ జెన్‌ సాకి విలేకరులతో మాట్లాడుతూ ఖాతాల నిషేధంపై నిర్ణయం ఆయా కంపెనీలదేనని స్పష్టం చేశారు.

తప్పుడు సమాచార వ్యాప్తిని కంపెనీలు అరికట్టాలని సాకీ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube