ఫేక్ పోస్టులపై పేస్ బుక్ కొరడా! తప్పుడు వార్త అయితే అకౌంట్ బ్లాక్  

ఫేక్ న్యూస్ పై సీరియస్ యాక్షన్ కి సిద్ధం అయిన పేస్ బుక్ .

Facebook Serious Action On Fake News Posts-bjp,congress,facebook Serious Action,fake News Posts,social Media

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాజంలో ఫేక్‌ న్యూస్ ని స్ప్రెడ్ చేసేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ప్రత్యర్ధి పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ అవతలి వారి ఇమేజ్ దెబ్బ తీయడానికి ఫేక్‌ అకౌంట్స్ నుంచి ఫేక్‌ న్యూస్ లో వైరల్ చేస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి న్యూస్ ని ప్రజలు కూడా నిజమని నమ్మే పరిస్థితి వచ్చేస్తుంది..

ఫేక్ పోస్టులపై పేస్ బుక్ కొరడా! తప్పుడు వార్త అయితే అకౌంట్ బ్లాక్-Facebook Serious Action On Fake News Posts

ఇక సోషల్ మీడియాలో పబ్లిష్ అయ్యే పోస్ట్ లకి సరైన ప్రామాణికాలు లేకపోవడం వలన అది ఎవరు సృష్టించారు అనే విషయంలో ఇంతకాలం గందరగోళం ఉండేది.

అయితే ప్రస్తుతం ఎలాంటి ఫేక్‌ పోస్ట్ లపై పేస్ బుక్ కొరడా ఝులిపించడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ అనుబంధంగా నడుస్తున్న పది లక్షల పోస్ట్ లని పేస్ బుక్ తొలగించింది. అలాగే 700 పేస్ బుక్ పేజీలని బ్లాక్ చేసింది. తాజాగా రాజకీయ నేతలాకి, ప్రజలకి పేస్ బుక్ మరో సారి హెచ్చరిక పంపించింది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ సామాజిక మాధ్యమం వేదికగా ఫేక్‌ న్యూస్‌, రెచ్చగొట్టే ప్రసంగాలు, మతాలు-కులాల మధ్య చిచ్చు పెట్టే పోస్టులకు చెక్‌ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. తమ నిబంధనలను ఉల్లంఘించే యూజర్ల ఖాతాలను తొలగిస్తున్నామని వెల్లడించింది.