ఇకపై అలాంటి వాటికి పేస్ బుక్ లో లో ఛాన్స్ ఉండదు

సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న సాంకేతిక ప్రపంచం.ప్రపంచంలో ఉన్న అన్ని మీడియాలకంటే సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు ఎక్కువగా ఉంది.

 Facebook Restriction On Irrelevant Content-TeluguStop.com

స్మార్ట్ ఫోన్, నెట్ వినియోగం సులభతరం అయిన తర్వాత సోషల్ మీడియాని ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువైపోయింది.ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఎలాంటి నియంత్రణ లేకపోవడం వలన చాలా మంది ఒకరి మీద ఒకరు విద్వేషకర వాఖ్యలు, ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించడం కించపరిచే వాఖ్యలతో రెచ్చిపోతూ ఉంటారు.

అలాగే సోషల్ మీడియాలో వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్రకటనలు, అలాగే విద్వేషాలు రెచ్చగొట్టే వీడియోలు ఎక్కువగా షేర్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.

అయితే ఇలాంటి నియంత్రణ లేకుండా జరుగుతున్న అరాచకాల కారణంగా సమాజంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి.

అమ్మాయిలని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసే గ్యాంగ్ లు కూడా ఎక్కువైపోయాయి.ఈ నేపధ్యంలో తాజాగా పేస్ బుక్ కొన్ని పాలసీలని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.

జాతి విద్వేషాన్ని, జాత్యాహంకార ప్రకటనలు, ప్రసంగాలతో పాటు, వేర్పాటు వాదన అంశాల్ని తమ ఫ్లాట్ ఫాం మీద అనుమతించేది లేదని తేల్చి పేస్ బుక్ తేల్చి చెప్పింది.ఇలాంటి వాటికి యాడ్స్ ని కూడా ఇవ్వడం కుదరదని, అవసరం అయితే ఇలాంటి వాటిపై పేస్ బుక్ కంట్రోల్ చేస్తుంది అని ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube