ఫేక్ న్యూస్ కి రేటింగ్ ఇవ్వబోతోన్న ఫేస్ బుక్ !  

ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం. ప్రతిఒక్కరూ…సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఇదే సమయంలో చాలా స్పీడ్ గా ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ అయిపోతోంది. వీటిని అరికట్టేందుకు ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా… ప్రయోజనం మాత్రం కనిపించడంలేదు. అందుకే ఇప్పుడు ఫేస్ బుక్ ఈ నకిలీ వార్తల స్ప్రెడ్డింగ్ అరికట్టేందుకు సిద్ధం అవుతోంది. అందుకే… కథనాలను సమీక్షించడమే కాకుండా… ఫోటోలు, వీడియోల్లా కూడా అసత్యాలను గుర్తించి పరిశీలించేందుకు … కొన్ని రకాల టూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Facebook Rating On Fake News-

Facebook Rating On Fake News

వీటి ద్వారా… వార్తా కథనాలను సమీక్షించి ఖచ్చితమైన రేటింగ్ ఇస్తారట. దీనికోసం ఇప్పటికే…ఇండియా టుడే గ్రూప్ , విశ్వాస్ న్యూస్ మొబైల్ ,ఫ్యాక్ట్స్ క్రిసెంటో సంస్థల సహకారం తీసుకోబోతున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది.