వైరల్: ఫేస్బుక్ పోస్టు దెబ్బకి.. చివరికి కటకటాలపాలు..!

సోషల్ మీడియా అనేది ఎవరిని ఎప్పుడు ముంచేస్తుందో చెప్పడం కష్టం.కొందరు సోషల్ మీడియా ద్వారా కోటీశ్వరులవుతారు.

 Facebook Post Hit. Finally The Lens . Viral Latest, News Viral, Social Media, Fa-TeluguStop.com

ఇంకొందరు కటకటాల పాలవుతారు.మరికొందరైతే అభాసుపాలవుతారు.

సోషల్ మీడియాలో మనం ముఖ్యం చెప్పుకునేది ఫేస్బుక్.దీని వల్ల కుర్రకారు ఎక్కువగా చెడిపోతున్నారనే వాదన వినిపిస్తోంది.

అయితే ఫేస్బుక్ వల్ల క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి.ఫోటోలు మార్పింగ్ చేసి బెదిరించడం, వ్యక్తిగత వివరాల ద్వారా బెదిరింపులకు పాల్పడటం వంటిచి చేస్తున్నారు.

అందుకే ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ బుక్ కు దూరంగా ఉండాలంటూ చెప్పుకొస్తున్నారు.తాజాగా ఫేస్బుక్ లో పెట్టినటువంటి ఒక పోస్టు ఓ వ్యక్తిని పోలీసు స్టేషన్ మెట్లెక్కేలా చేసింది.

అతడు పెట్టిన పోస్టు అతడ్ని కటకటాలపాలు చేసింది.ఇంతకీ అతను పెట్టిన పోస్టు ఏంటో, ఎందుకు అతన్ని పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం.

అమెరికాలోని మిస్సోరీ ప్రాంతానికి చెందినటువంటి జేమ్స్ కర్ట్జ్ అనే వ్యక్తి మోటార్‌ వాహనాలల్లో ఉపయోగించేటటువంటి కేటలిటిక్ కన్వర్టర్ ను విక్రయించాలని అనుకున్నాడు.దీంతో ఆ వస్తువును సేల్ చేసే క్రమంలో దాని ఫోటోను ఫేస్బుక్ మార్కెట్లో పోస్టు ద్వారా తెలియజేశాడు.

అయితే పోస్టు చేస్తున్న సందర్భంలో ఫోటో చుట్టూ ఉన్న వస్తువులను తీసివేయడం అతను మర్చిపోవడంతో అవే అతని కొంప ముంచాయి.

Telugu America, Drugs, Jail, Messori, Latest-Latest News - Telugu

అతను ఫేస్బుక్ లో పోస్టు చేసిన ఫొటోలో నిషేదించబడినటువంటి డ్రగ్ మెథాంఫెటమైన్ ఉంది.దానిని మెత్ అని అంటారు.ఆ నిషేదిత డ్రగ్ అమ్మాలనుకున్న కేటలిటిక్ కన్వర్టర్ పరికరం పక్కనే ఉంది.

దానిని ఫేస్‌బుక్‌ లో చూసినటువంటి కొందరు వ్యక్తులు పోలీసులకు తెలియజేశారు.పోలీసులు అప్రమత్తమై ఆయన ఇంటిపైన రైడ్ చేయగా ఇంట్లో 48గ్రాముల మెత్‌ తో పాటు లైసెన్స్ లేని ఓ గన్ లభ్యమైంది.

ఆ రెండూ స్వాధీనం చేసుకొని జేమ్స్ కర్ట్జ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube