100 బిలియన్ డాలర్ల లిస్ట్ లోకి చేరిన మార్క్ జుకర్​ బర్గ్...!

ప్రపంచంలో 100 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ చేరారు.తాజాగా ఫేస్ బుక్ సంస్థకు చెందిన షేర్లు అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ లో భారీగా పెరగడంతో ఆయన ఈ మార్క్ ను అందుకున్నారు.

 Facebook Founder Mark Zuckerberg Joins $ 100 Billion Club, Mark Zuckerberg, Face-TeluguStop.com

ఇకపోతే ఈ లిస్టు లో ఇప్పటివరకు ప్రపంచ కుబేరులైన జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ ఉన్నారు.తాజాగా మార్క్ జూకర్ బర్గ్ వారి సరసన చేరారు.బ్లూమ్ బర్గ్ బిలియర్డ్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం మార్క్ జుకర్ బర్గ్ సంపాదన కేవలం తనకు ఉన్న 13% ఫేస్ బుక్ వాటా ద్వారానే ఈ స్థాయికి చేరినట్టు తెలిపింది.తాజాగా ప్రపంచదేశాల్లో టిక్ టాక్ పై బ్యాన్ విధించడంతో, టిక్ టాక్ కు పోటీగా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ సదుపాయాన్ని పేస్ బుక్ సంస్థ తీసుకు వచ్చింది.

తాజాగా టిక్ టాక్ బ్యాన్ భారత్, అమెరికా దేశాలలో బ్యాన్ కావడంతో ఆ స్థానాన్ని ఇంస్టాగ్రామ్ భర్తీ చేయగలదని ఫేస్ బుక్ సంస్థ ఆలోచిస్తోంది.ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా ఆర్థిక సంస్థ సంక్షోభం లో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు అమెరికా టెక్ దిగ్గజాల అధినేతల సంపద మాత్రం భారీగా పెరిగిపోతుంది.

తాజాగా ఫేస్ బుక్ అధినేత సంపద 22 బిలియన్ డాలర్లు పెరగగా, ఇక అమెజాన్ అధినేత సంపద ఏకంగా 75 బిలియన్ డాలర్లు పెరిగింది.అందుకే అంటారేమో కాబోలు… డబ్బు ఉన్నోడు మరింతగా డబ్బు సంపాదిస్తాడని, డబ్బు లేని వాడు మరింత దిగజారి పోతున్నాడని.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube