పొలిటికల్ లీడర్స్ కి షాక్ ఇస్తున్న పేస్ బుక్   Facebook Makes Political Ads More Transparent Ahead Of Russia Hearings     2017-10-30   04:52:23  IST  Bhanu C

పేస్ బుక్ ఇప్పుడు ఒక సంచలనం..ఎవరికీ నచ్చినట్టుగా వారి వారి మనోభావాలని సోషల్ మీడియా ద్వారా పంపవచ్చు..ఇదే చాలా మందికి పెద్ద వేదికలా అయ్యింది..ఉద్యమాలని సైతం సోషల్ మీడియాలో ఒక్క మెసేజ్ ద్వారా కొన్ని కోట్ల మందికి తెలియచేసి ఫేమస్ అవుతున్న వాళ్ళు అనేకం..సోషల్ మీడియాలో కొందరికి ఉన్న ఫాలోయింగ్ సినిమా స్టార్స్ కి కూడా లేకపోవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.అదే రాజకీయ నాయకులకి కూడా వరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పేస్ బుక్ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కి షాక్ ఇస్తోంది.

ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ ప్రమోషన్స్ మీద మరిన్ని ఆంక్షలు పెట్టాలని తీర్మానించింది. ఇప్పటివరకు అన్ని రకాల విషయాల ప్రచారానికి సోషల్ మీడియా ఒక వేదిక. అక్కడ చేసుకునే వ్యాపార ప్రకటనలకు ఎవరికి లెక్కలు చెప్పాల్సిన పని లేదు. ఇదే అదనుగా పొలిటికల్ లీడర్స్ ఫేస్ బుక్ వంటి సోషల్ ప్లాట్ ఫామ్ లను తమ ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రధానమైన ప్రింట్ – ఎలక్ట్రానిక్ మీడియాలకు లకు దీటుగా వెబ్ మీడియాకు కూడా ఇప్పుడు క్రేజ్ పెరిగిపోతోంది. సినిమాలకు – వ్యాపారాలకు సంబంధించిన ప్రకటనలు ఎవరిచ్చారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అయితే సోషల్ మీడియాలో వచ్చే రాజకీయ ప్రకటనలు మాత్రం ఇందుకు పూర్తి బిన్నం. ఆ ప్రకటనకర్తలు ఎవరో గుర్తించలేం.అందుకే ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని పేస్ బుక్ నిర్ణయించింది.

రాజకీయనాయకులకు అనుకూలంగా ప్రకటనలు ఇస్తున్నదేవరో అందరూ తెలుసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీస్తున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. ఈ పరిస్థితిని మార్చాలని ఎవరు ప్రకటనలు ఇస్తున్నారు అన్నది అందరూ తెలుకునేలా ఫేస్ బుక్ చర్యలు చేపట్టింది. ఇకపై సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ఇస్తున్న వారి వివరాలను బహిర్గతం చేస్తామని ఫేస్ బుక్ ప్రకటించింది. ఇప్పటి నుంచి పేస్ బుక్ లో రాజకీయ ప్రకటనలు ఇచ్చేవారు తమ వివరాలను కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఆ ప్రకటనకు డబ్బులెవరిచ్చారో కూడా ప్రకటనలో స్పష్టంగా పొందుపరచాల్సి ఉంటుంది. ఆ ప్రకటనకర్తల చిరునామా – ప్రాంతం వంటి వివరాలు తప్పనిసరి చేస్తామని ఫేస్ బుక్ తెలిపింది. ఆ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ‘పెయిడ్ ఫర్ బై’ అనే ఆప్షన్ ను ఫేస్ బుక్ కు యాడ్ చేయబోతోంది. ఫేస్ బుక్ లో ‘పెయిడ్ ఫర్ బై` ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆ ప్రకటన ఇచ్చినవారి పూర్తి వివరాలు తెలుస్తాయి.

రాజకీయ నాయకుల ప్రకటనల విషయంలో పూర్తి పారదర్శకతతో పాటుగా.. రాజకీయ ప్రకటనలపై ‘లేబుల్’ వేయడంతో నిధులిచ్చినవారి వివరాలు బహిరంగపరిచేలా చేయాలన్నది వాటి ఉద్దేశం. ఇందుకోసమే ఇప్పుడు ఫేస్ బుక్ – ట్విట్టర్ లు ప్రత్యేక చర్యలు చేపట్టాయి..రాజకీయాల్లో పారదర్సకత ఉండాలంటే ఇలాంటి మార్పులు తప్పవు అని అంటున్నారు సోషల్ మీడియా దిగ్గజాలు..మరి ముందు ముందు ఇంకెలాంటి షాకులు పొలిటికల్ లీడర్స్ చవి చూడాలో అని తెగ టెన్షన్ పడుతున్నారు..అసలే ఇప్పటికి చాలామంది నాయకులూ పేస్ బుక్ నమ్ముకుని రాజకీయంగా ఆధారపడిన వాళ్ళు కోకొల్లలు..మరి అలాంటి వాళ్ళకి ఇది నిజంగా షాక్ న్యూస్.