యూజర్లకు మరిన్ని సేవలను తీసుకురాబోతున్న ఫేస్ బుక్..!

మనలో దాదాపు అందరు ఫేస్ బుక్ వాడుతూనే ఉన్నాము.పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ బుక్ ను వినియోగిస్తుంటారు.

 Facebook Is Going To Bring More Services To The Users  Facebook, Social Media, N-TeluguStop.com

మరి అటువంటి ఫేస్ బుక్ మరో సరికొత్త రంగంలోకి అడుగుపెట్టింది.ఫేస్‌బుక్ ఆన్‌లైన్ చెల్లింపు విధానాన్ని విస్తరించనుంది.

అది కూడా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ ల ద్వారా ఆ పనులను చేయనుంది.ఫేస్‌ బుక్ ఈ-కామర్స్ ప్లాట్‌ ఫామ్ షాపిఫైతో ఫేస్‌ బుక్ పే మొదలు పెట్టడానికిి సన్నద్దమవుతోంది.

ఇకపై వినియోగదారులు చెల్లింపులు చేయడం అతి సులభం కానుంది.ఫేస్‌బుక్ పే సిస్టమ్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ లతో పాటు దాని ప్రధాన ప్లాట్‌ఫామ్ లపైన యూజర్లకు సౌకర్యవంతమైన రీతిలో అందుబాటులోకి రానుంది.

ఆగస్టు నెల నుంచి అమెరికాలో వ్యాపారం చేయడానికి ఫేస్‌బుక్ పే వ్యవస్థ అందుబాటులోకి రానుంది.దానిని ఉపయోగిస్తున్న వారు కూడా నేరుగా వెబ్‌సైట్‌ ద్వారా చెల్లింపులు అనేవి చేయవచ్చని ఫేస్ బుక్ యాజమాన్యం వెల్లడించింది.

ఈ విధానం వలన యూజర్లు ప్రతిసారీ వారి ట్రాన్సాక్షన్ సమాచారాన్ని ఇవ్వాల్సిన పనిలేదు.దీనివల్ల చెల్లింపులు అనేవి ఆలస్యం కావు.ట్రాన్సాక్షన్లు అనేవి వేగంగా జరపవచ్చు.ఇప్పుడు ఈ విధానాన్ని షాపీ పే ద్వారా ఫేస్‌బుక్ నిర్వహించనుంది.

భవిష్యత్ లో కూడా ఇంకొన్ని చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ లు దీనికి లింక్ చేసే అవకాశం ఉందని ఫేస్‌బుక్ తెలియజేసింది.

Telugu Pay, Shopify-Latest News - Telugu

డబ్బు పంపడం, షాపింగ్ చేయడం, విరాళం ఇవ్వడం ఇలా ఎన్నో రకాల సేవలు అనేవి ఫేస్ బుక్ తన యూజర్ల కోసం అందించనుంది.ఫేస్‌బుక్ పే ద్వారా ఈ సేవలన్నీ అందరికీ అందుబాటులోకి రానున్నాయి.ఫేస్‌బుక్ పే ద్వారా నిర్వహించే ట్రాన్సాక్షన్లు చాలా సేఫ్ అని దానికి బ్యాంక్ ఖాతా నెంబర్ లేదా ఎటువంటి కార్డుల అవసరం అనేది కూడా ఉండదని ఫేస్ బుక్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube