ఆ సోషల్ మీడియా యాప్స్ నుండి అంతమంది యూజర్ల డేటా లీక్‌..!?

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులకు రక్షణ లేకుండా పోతోంది.వారు ఉపయోగించే ఏ ఒక్క అప్లికేషన్ సమాచారమైనా సరే అందుకు సంబంధించి సర్వర్ లో స్టోర్ అవుతూ వస్తుంది.

 Data Leaked By So Many Users From Those Social Media Apps Social Media, Faceboo-TeluguStop.com

ఇకపోతే గతంలో ఫేస్ బుక్ యూజర్ల సమాచారం కూడా అనేక సార్లు లీక్ అయిన సంగతి తెలిసిందే.ఇక ఈ సారి మాత్రం ఆ ఛాన్స్ యూట్యూబ్, టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ వంతు వచ్చింది.

ఈ మూడు యాప్స్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఇరవై మూడు కోట్ల మందికి పైగా యూజర్ల డేటా లీక్ అయ్యిందని వెల్లడైంది.ఈ మూడు యాప్స్ సంబంధించి ఫోటోలు పేర్లు మొదలగు సమాచారాల విషయాలన్ని లీకయ్యాయి.

అయితే ఈ సమాచారాలన్ని డీప్ సోషల్ అనే కంపెనీ ద్వారా లీక్ జరిగినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంపై స్పందించిన కంపెనీ, డేటా లీక్ జరిగింది నిజమేనని … అయితే డేటాను సేకరించడం ప్రస్తుతం ఆపేశామని ఆ కంపెనీ తెలియజేసింది.

అయితే ఇందుకు ఆ కంపెనీ మరో విధంగా స్పందిస్తూ… సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులో ఉండే డేటాను మాత్రమే సేకరించడం పెద్ద తప్పేం కాదని…, అది హ్యాకింగ్ కు గురైనట్లు కాదని తెలిపింది.అయితే ఇలా సేకరించిన సమాచారం హ్యాకర్స్ ఫిషింగ్ వంటి స్కాం లకు ఉపయోగిస్తారు.

ఇలాంటి విషయాల ద్వారా సోషల్ మీడియా లో ఉన్న ప్రతి ఒక్కరి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది వరకు ఇలాంటి పరిస్థితులను ఫేస్ బుక్ సంస్థ ఎదుర్కొన్న దాఖలాలు కూడా ఉన్నాయి.

వేరే కంపెనీ లు ఫేస్ బుక్ లో ఉన్న సమాచారాన్ని సేకరిస్తున్నా కూడా ఫేస్ బుక్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ద్వారా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.ఆ తర్వాత ఫేస్ బుక్ విషయంపై స్పందించి, ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని ఫేస్ బుక్ సంస్థ వారి యూజర్లకు క్షమాపణలు తెలియజేసింది.

కాకపోతే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో దిగ్గజ కంపెనీ అయిన ఫేస్ బుక్ నుండే సమాచారాన్ని దొంగలించిన హ్యాకర్స్, మిగతా వాటిని ఎలా వదిలి పెడతారు చెప్పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube