ఒక్క రోజులో భారీగా నష్టపోయిన ఫేస్ బుక్ … కారణం అదేనా ..?  

Facebook Huge Loss Advertising - Telugu Advertising, Coca Cola Company, Facebook, Facebook Ads, Huge Loss, Social Media Platforms

సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ఫేస్ బుక్అ ధినేత మార్క్ జూకర్ బర్గ్ కు ఒక్క రోజే ఏకంగా 53 కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది.ఫేస్ బుక్ లో ప్రకటనలు నిలిపివేస్తూ వెరిజాన్, హెర్షీ కో, యూనిలీవర్, హోండా మోటార్, కోకాకోలా దిగ్గజ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

 Facebook Huge Loss Advertising

దీంతో ఫేస్ బుక్ షేర్లు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి.ఫేస్ బుక్ షేర్ ఒక్క రోజే ఏకంగా 8.5 శాతం పడిపోయింది.దీంతో ఫేస్ బుక్ అధినేత జూకర్ బర్గ్ భారీగా నష్టపోయారు.

అసలు విషయం లోకి వస్తే… ఒక నెల రోజుల పాటు కోకాకోలా కంపెనీ తన ప్రకటనలను ఫేస్ బుక్ కు ఇవ్వబోమని తెలపగా అదే దారిలోనే హోండా మోటార్స్, వెరిజాన్, హెర్షీ కో, యూనిలీవర్ కంపెనీ లు కూడా నడిచాయి.ఇందుకు ప్రధాన కారణం విద్వేషపూరిత ప్రసంగాలను నిరోధించేందుకు ఫేస్ బుక్ సంస్థ సరిగా పని చేయట్లేదని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది.

ఒక్క రోజులో భారీగా నష్టపోయిన ఫేస్ బుక్ … కారణం అదేనా ..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఇదే విషయంపై అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఫేస్ బుక్ పై విమర్శలు అధిక మొత్తంలో కొనసాగుతున్నాయి.ఈ పరిస్థితులలో తప్పుడు వార్తలపై ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ సమాధానమిస్తూ అన్నిరకాల ఓటింగ్ సంబంధించిన పోస్టులకు కొత్త ఓటర్ సమాచారం అనే లింకును ఇస్తామని ఆయన తెలియజేశారు.

ఇక మరోవైపు ఏమైనా విద్వేషపూరిత వ్యాఖ్యలపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని, ఇటువంటి వాటికి రాజకీయ నాయకులు కూడా తప్పించుకోలేరని ఆయన ఘాటుగా స్పందించారు.దీనితో ప్రపంచ కుబేర లిస్టులో మార్క్ జూకర్ బర్గ్ స్థానం మూడు నుంచి నాలుగు కు దిగజారింది.

లూయిస్ విట్టన్ అధినేత అర్నాల్ట్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నారు.అలాగే అమెజాన్ అధినేత బెజోస్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ రెండో స్థానంలో ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Facebook Huge Loss Advertising Related Telugu News,Photos/Pics,Images..

footer-test