యూజర్ల కోసం మరో అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చిన ఫేస్బుక్..!

ఈ మధ్యకాలంలో చాలా సైబర్ నేరాలు జరుగుతున్నాయి.అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు మోసపోతున్నారు.

 Facebook Has Brought Another Creepy Feature For Users Facebook , Social Meida,-TeluguStop.com

ప్రైవసీ విషయంలో యూజర్లు ఆందోళన చెందుతున్నారు.వినియోగదారులకు సేఫ్టీ విషయంలో అనేక సంఘటనలు ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్నాయి.

అందుకే చాలా యాప్ లు, అనేక సోషల్ మీడియా సంస్థలు తమ యూజర్ల ప్రైవసీ కోసం అనేక ఫీచర్లను తీసుకొస్తున్నాయి.ఫేస్బుక్ కూడా తమ యూజర్ల కోసం అనేక ఫీచర్లను తీసుకొస్తోంది.

ఫేస్బుక్ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటోంది.తాజాగా ఎండ్‌ -టూ- ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అనే ఫీచర్ ను తీసుకొచ్చింది.

ఇది మనకు ముందే తెలిసిందే.వాట్సాప్‌ యాప్‌ లో వాయిస్‌, వీడియో కాల్స్‌ కు ఉండే ఎండ్‌- టూ -ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అనేది చాలా మందికి తెలిసిన ఫీచరే.

ఫేస్బుక్ కూడా తమ యూజర్లకు దీనినే అందుబాటులోకి తీసుకొచ్చింది.దీనివల్ల వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కూడా తలెత్తదు.

వాయిస్, వీడియో కాల్స్ కు ఈ ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ ను తీసుకురావడం పట్ల ఫేస్బుక్ యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.చాలా రోజుల నుంచి ఫేస్బుక్ కు సంబంధించి అనేక సైబర్ నేరాలు జరుగుతున్నాయి.

చాలా మంది సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ఫేస్బుక్ లోని అమాయకుల ఫోటోలను తీసుకుని మార్పింగ్ చేస్తున్నారు.

Telugu Meida, Latest-Latest News - Telugu

ఆ మార్పింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడమో లేకుంటే అత్యాచారాలు చేయడమో చేస్తున్నారు.ఇంకొందరు అయితే హత్యలు కూడా చేయడానికి వెనకాడటం లేదు.అందుకే ఫేస్బుక్ తమ యూజర్ల శ్రేయస్సు కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చింది.

ఇదే ఫీచర్ ను ఫేస్బుక్ తమ సంస్థ అయిన ఇన్స్టాగ్రామ్ లో కూడా తీసుకరావాలని చూస్తోంది.ప్రస్తుతం ఫేస్బుక్ యూజర్లు ఈ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube