కొత్త డేటింగ్ సర్వీస్ ను ప్రారంభించిన ఫేస్‌బుక్‌..! కొత్తగా 32 దేశాలలో అందుబాటులోకి..

సోషల్ మీడియాలో దిగ్గజ కంపెనీ అయిన ఫేస్ బుక్ తాజాగా తన డేటింగ్ సర్వీస్ ను మరికొన్ని దేశాలలో లాంచ్ చేసింది.ఇందుకు సంబంధించి ఈ సంవత్సరం మొదట్లో రోల్ అవుట్ కావాల్సి ఉండగా రెగ్యులేటరీ ఆందోళన కారణంగా ఆలస్యం కావడంతో.

 Facebook Launch The New Dating Service  Facebook, Dating Service, European Count-TeluguStop.com

తాజగా ఇప్పుడు మొత్తం 32 యురోపియన్ దేశాలలో ఈ డేటింగ్ సర్వీసును మొదలుపెట్టినట్లు ఫేస్బుక్ తాజాగా వెల్లడించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ సంస్థలు అలాగే ఫేస్బుక్ తో సహా చాలా కంపెనీలు యూరప్ దేశాల్లో ఉన్న యూరోపియన్ యూనియన్ లోని ప్రధాన రెగ్యులేటర్ అయిన డేటా ప్రొడక్షన్ కమిషనర్ ఆందోళన వ్యక్తం చేయడంతో సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ డేటింగ్ సర్వీసును ఫిబ్రవరిలోనే విడుదల చేయాల్సి ఉండగా అది కాస్త వాయిదా వేయాల్సి వచ్చింది.

ఫేస్బుక్ సంస్థ చేపట్టిన డేటా ప్రొడక్షన్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సంబంధించి డాక్యుమెంటేషన్ ఇవ్వకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.

ఫేస్బుక్ యాప్ ‌లోని డేడికేటెడ్, ఆప్ట్-ఇన్ స్పేస్ ను ఉపయోగించి డేటింగ్ ను ఇదివరకే గత సంవత్సరం సెప్టెంబరు నెలలో అమెరికాలో మొదలుపెట్టారు.

అయితే, ఇది ప్రస్తుతం 20 దేశాలలో మాత్రమే అందుబాటులో ఉందని తెలిపింది ఫేస్బుక్ .అయితే ఈ డేటింగ్ సంబంధించి ఎక్కడైతే సర్వీస్ అందించబడుతుందొ అక్కడ ఉన్న ప్రజలు డేటింగ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చునని, అలాగే వారి ఫేస్ బుక్ అకౌంట్ ను డిలీట్ చేయకుండా డేటింగ్ ప్రొఫైల్ ను ఎప్పుడైనా తొలగించవచ్చని తెలిపింది.ఇక ఇందులో డేటింగ్ సంబంధించి ప్రొఫైల్ వివరాలను ఫేస్బుక్ ప్రొఫైల్ నుండి తీసుకోబడతాయని ఫేస్బుక్ తెలియజేసింది.దీంతో డేటింగ్ సర్వీసులో వారి పేర్లను ఎడిట్ చేసుకోవడానికి వీలు ఉండదు.

వారి వివరాలను ఇతరుల వ్యక్తులతో పూర్తిగా షేర్ చేసుకోవచ్చో లేదన్న విషయాన్ని మాత్రం యూజర్స్ కే వదిలేసింది ఫేస్బుక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube