ఫేస్‌బుక్‌ సీఈఓ చీటింగ్‌.. జీతం సంవత్సరానికి 1 డాలర్‌.. కాని ఖర్చు మాత్రం రూ. 250 కోట్లు  

Facebook Ceo Salary And Cost-facebook Ceo,mark Zuckerberg,salary And Cost,ఫేస్‌బుక్‌కు సీఈఓ,సెక్యూరిటీ ఖర్చు

రాజకీయ నాయకులు మరియు సెలబ్రెటీలకు సెక్యూరిటీ భారీగా ఉంటుంది. వారు జనాల్లోకి వస్తే ఇబ్బందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించడంతో పాటు, ప్రైవేటుగా వారు కూడా సెక్యూరిటీని పెట్టుకుంటారు. అయితే కొందరు అవసరం లేకుండా పదుల సంఖ్యలో సెక్యూరిటీని పెట్టుకుని తిరుగుతుంటారు..

ఫేస్‌బుక్‌ సీఈఓ చీటింగ్‌.. జీతం సంవత్సరానికి 1 డాలర్‌.. కాని ఖర్చు మాత్రం రూ. 250 కోట్లు-Facebook CEO Salary And Cost

ఇండియాలోని ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు సెక్యూరిటీ లేకుండానే తిరిగేస్తు ఉంటారు. కొందరు ఒక్కరు ఇద్దరు సెక్యూరిటీతో బయటకు వెళ్తారు. కాని కొందరు సీఎంలు మాత్రం పెద్ద ఎత్తున సెక్యూరిటీని పెట్టుకుంటారు.

ఇప్పుడు సెక్యూరిటీల విషయం ఎంటీ అంటారా, అసలు విషయం ఏంటీ అంటే ఫేస్‌ బుక్‌ వ్యవస్థాపకుడు జుకర్‌బర్త్‌ గత ఏడాది తన సెక్యూరిటీ కోసం ఏకంగా 140 కోట్ల రూపాయలను ఖర్చు చేయించాడు.

ఫేస్‌బుక్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్నందుకు జుకర్‌బర్త్‌ కేవలం ఒక్క డాలరును ఏడాది జీతంగా తీసుకుంటున్న జుకర్‌ బర్త్‌ ఇతర ఖర్చుల రూపంలో షేర్‌ హోల్డర్స్‌ డబ్బులు అన్ని నాశనం చేస్తున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తన భద్రత మరియు కుటుంబ భద్రత, ఇతర ఖర్చులు అన్ని కలిపి సంవత్సరంలో దాదాపు 250 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాడట. ఇది గత ఏడాదితో పోల్చితే పెరిగిందని, సంవత్సరం సంవత్సరం ఖర్చులను పెంచుకుంటూ పోతూ ఫేస్‌ బుక్‌ షేర్‌ హోల్డర్స్‌ను మోసం చేస్తున్నాడంటూ కొందరు షేర్‌ హోల్డర్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జుకర్‌ బర్గ్‌కు అంత సెక్యూరిటీ అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా, మరి కొందరు మాత్రం ఆయన్ను సమర్ధిస్తున్నారు. ఫేస్‌బుక్‌ వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. ఆ నష్టాలను ఎదుర్కొన్న వారు జుకర్‌ బర్గ్‌ను చంపేసే అవకాశం ఉందని సమాచారం ఉండటంతో హై సెక్యూరిటీని ఇస్తున్నారు.

డాటా లీకేజ్‌ విషయంలో కూడా జుకర్‌ బర్గ్‌ చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కొందరు జుకర్‌ బర్గ్‌ను హెచ్చరించారు కూడా అందుకే ఆయన సెక్యూరిటీని పెట్టుకున్నాడు. వందల కోట్ల రూపాయలు సెక్యూరిటీకి ఖర్చు చేయడం ఏం పద్దతిగా లేదంటూ షేర్‌ హోల్డర్స్‌ అంటున్నారు.