పది నిముషాలు ఇలా చేస్తే నల్లగా ఉన్నవారు తెల్లగా మారతారు...ఇది నిజం  

  • ప్రతి ఒక్కరు ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఉన్న బిజీ జీవనశైలిలో దుమ్ము,ధూళి,పొల్యూషన్ బారి నుండి కాపాడుకోవటం కొంచెం కష్టమైన పనే. ఈ ప్రభావం ఎక్కువగా ముఖం మీద పడుతుంది. బయటకు వెళ్లి పనులు చూసుకొని ఇంటికి వచ్చాక అద్దంలో ముఖం చూసుకుంటే నల్లగా మారిన ముఖమును చూసి బాధపడతాం. ఆ బాధ నుండి విముక్తి కలిగి నల్లని ముఖం తెల్లగా మెరిసిపోవాలనుంటే ఒక మంచి చిట్కా ఉంది. ఈ చిట్కా ముఖం మీద మలినాలను,నలుపును,తాన్ ను తొలగించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

  • ఈ చిట్కాకి నిమ్మకాయ, BRU కాఫీ పొడి అవసరం అవుతాయి. కాఫీ పొడిని ఒక ప్లేట్ లో తీసుకోని నిమ్మచెక్కను కాఫీ పొడిలో అద్ది ముఖం మీద స్క్రబ్ వలే రుద్దాలి. ఈ విధంగా చేయటం వలన చర్మ రంద్రాలు తెరుచుకొని మలినాలు తొలగిపోతాయి. వీటిలో ఉండే పోషకాలు చర్మ రంగును మెరుగుపరుస్తాయి. ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసాక పది నిముషాలు ఆలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

  • ఆ తర్వాత అలోవెరా జెల్ తీసుకోని ముఖానికి రాయాలి. అలోవెరా జెల్ అందుబాటులో లేకపోతే మాయిశ్చరైజర్ క్రీమ్ ని అయినా రాయవచ్చు. ఈ విధంగా రాత్రి సమయంలో చేస్తే మరుసటి రోజు ఉదయం లేవగానే ముఖం తాజాగా కాంతివంతంగా కనపడుతుంది. ఈ విధంగా మూడు నుంచి నాలుగు రోజులు చేయగానే మీ ముఖం ఉన్న తాన్,నలుపు,మలినాలు అన్ని తొలగిపోతాయి. దాంతో ముఖం తెల్లగా,కాంతివంతంగా అందంగా ఉంటుంది. ఇదే చిట్కాను మెడ, మోచేతుల మీద కూడా అప్ప్లై చేయవచ్చు. నల్లగా మారిన ముఖాన్ని తెల్లగా మార్చటానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.