ఈ టెక్నాలజీ మాకొద్దు..అమెరికా వాసుల గగ్గోలు..!!!  

This Technology Dont Want Americans - Telugu America, Face Recognition Technology, Nri, Technology, Telugu Nri News Updates, ఫేస్ రికగ్నైజేషన్

నేటి కాలం మొత్తం టెక్నాలజీ సొంతం.రోజురోజుకి సాంకేతికత పెరుగుతూనే ఉంది.

This Technology Dont Want Americans

దీని వల్ల ఎంతో వరకు జీవనం సులువుగా ముందుకు వెళుతోంది.ఎంత ముందుకు దూసుకువెళ్తున్నా కూడా, సాంకేతికత హద్దులు ధాటి పురోగామించకూడదు.

ఈ మితిమీరిన అభివృద్ది ఏదో ఒక రూపంలో భవిషత్తులో మనకే నష్టాన్ని తీసుకువచ్చే ప్రమాదం తీసుకురావచ్చేమో కదా.అటువంటి ఓ టెక్నాలజీపై నిషేధం విధించాలని అమెరికా అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

అమెరికాలో దాదాపు 40కు పైగా మనవ హక్కువ సంఘాలు ‘ఫేస్ రికగ్నైజేషన్’ టెక్నాలజీపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.దీనికి సంబంధించి యూనివర్సిటీ విద్యార్ధులను హెచ్చరిస్తూ “ఫైట్ ఫర్ ది ఫ్యూచర్” అనే నినాదాన్ని కూడా తీసుకువచ్చారు.

అయితే ఈ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో క్యాంపస్ లు సురక్షితంగా ఉంటాయని కంపనీలు చెప్పే మాటలు విద్య సంస్థలు వినవద్దని మనవ హక్కుల సంఘాలు అన్ని యూనివర్సిటీలకు పిలుపునిచ్చాయి.ఈ నేపధ్యంలోనే.

దీని నిషేధం కోసం కృషి చేయడానికి మనవ హక్కుల సంఘాలన్నీ, ఈ సాంకేతికత వలన కలేగే నష్టాలు కేవలం గోప్యతా హక్కుల భంగం మాత్రమే కాదు, వలసదారుల హక్కులకు కూడా నష్టం జరిగే అవకాశం ఉందని శుక్రవారం ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే నినాదానికి మద్దతుగా ఈ ప్రకటనపై ఎసిఎల్యూ, ది నేషనల్ ఇమ్మిగ్రేషన్ లా సెంటర్, నేషనల్ సెంటర్ ఫర్ ట్రాన్స్ జెండర్ ఈక్వాలిటీలు సంతకాలు చేశాయి.

తాజా వార్తలు