చర్మం జిడ్డు లేకుండా మిలమిల మెరవాలంటే... డ్రై ఫ్రూట్ ప్యాక్స్

Face Glow Dry Fruits Paks For Oily Skin

అందమైన, మచ్చలు లేని ముఖం కావాలని అందరూ ఆశ పడతారు.అయితే దాన్ని సాధించటం చాలా కష్టమని అందరూ భావిస్తారు.

 Face Glow Dry Fruits Paks For Oily Skin-TeluguStop.com

అయితే ఇంట్లో సులువుగా అందుబాటులో ఉండే వస్తువులతో చాలా సులభంగా అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.ఇప్పడూ ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

క్యారెట్ ముక్క, బీట్ రూట్ ముక్క,ఒక టమోటా,ఒక స్పూన్ బాదం పొడి మిక్సీ చేయాలి.ఈ పేస్ట్ లో పెరుగు కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

 Face Glow Dry Fruits Paks For Oily Skin-చర్మం జిడ్డు లేకుండా మిలమిల మెరవాలంటే… డ్రై ఫ్రూట్ ప్యాక్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాలుగు జీడిపప్పులను మెత్తని పొడిగా చేసుకొని దానిలో పచ్చి పాలను కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

Telugu Badam, Beet Root, Carrot, Dry Fruits Pack, Glowing Skin, Healthy Skin, Oily Skin, Rose Water, Skin Care Tips, Telugu Health Tips-Telugu Health

ఒక స్పూన్ జీడిపప్పు పొడిలో ఒక స్పూన్ ఆవాల నూనె, రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి.ఈ విధంగా చేయటం వలన ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం కాంతివంతంగా మారుతుంది.

నాలుగు బాదం పప్పులు,పచ్చి పాలు, రోజ్ వాటర్ వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీలో వేయాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి మూడు సార్లు చేసు ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

#Care Tips #Healthy #Carrot #Rose Water #Oily

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube