కాసేపట్లో తాళి కట్టాల్సి ఉండగా..ఆమె పెళ్లి ఆగిపోయింది.! కారణం ఓ సెల్ఫీ.! అసలేమైందో తెలుస్తే షాక్!       2018-07-02   02:25:54  IST  Raghu V

సినిమాలో పెళ్లి సీన్ అంటే…మధ్యలో ఒకరు వచ్చి ఆపండి అని గట్టిగ అరవడం మనం చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాము. తీరా చూస్తే అతను పెళ్లికూతురు లవర్ అవ్వడం లేదా ఆమె పెళ్ళికొడుకు లవర్ అవ్వడం విశేషం. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యింది. పెళ్లి మండపం దాకా వెళ్లి అరిచి అప్పనక్కర్లేదు. సింపుల్ గా వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తే చాలు వధూవరుల పెళ్లి ఆగిపోతుంది. ఇలాంటి ఘటన జరిగింది సినిమాలో కాదండి. కరీంనగర్ లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.!

వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన యువతి (23) హైదరాబాద్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో మూడేళ్లుగా పనిచేస్తోంది. ఆమెతోపాటు క్యాషియర్‌గా పనిచేస్తున్న మల్లబోయిన ప్రశాంత్‌ అనే యువకుడు ఓ సందర్భంలో ఆమెతో కలిసి సెల్ఫీ దిగాడు. కాగా.. ఆ యువతికి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని కనుకదుర్గ కాలనీకి చెందిన ఆడెపు అనిల్‌ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. ఆదివారం వివాహం జరిపేందుకు కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ పట్టణంలోని బీఎ్‌సఆర్‌ గార్డెన్‌లో పెద్దలు ఏర్పాట్లు చేశారు.

కాసేపట్లో తాళి కట్టాల్సి ఉండగా.. వరుడు అనిల్‌ కుమార్‌ ఫోన్‌కు ప్రశాంత్‌ వధువుతో గతంలో దిగిన సెల్ఫీ ఫొటోలు పంపాడు. వరుడికి ఫోన్‌ చేసి.. వధువు, తాను ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో.. వరుడు పెళ్లికి నిరాకరించాడు. తనను మోసం చేశారంటూ.. వధువు, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అటు వధువు కూడా ప్రశాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడో తీసుకున్న సెల్ఫీని చూపి తన పెళ్లి ఆగిపోయేందుకు కారణమైన ప్రశాంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.