వేసవిలో చర్మ సంరక్షణకు స్క్రబ్స్   Fabulous Face Scrubs For Summer     2018-03-25   02:14:15  IST  Lakshmi P

వేసవికాలం వచ్చేస్తుంది. వేసవికాలంలో చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది. చర్మ సంరక్షణకు మార్కెట్ లో అనేక రకాల సౌందర్య సాధనాలు ఉన్నప్పటికీ ఇంటిలో తయారుచేసుకొనే స్క్రబ్స్ ని ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మ సంరక్షణ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్క్రబ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక బౌల్ లో ఒక స్పూన్ ఓట్స్, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్,నాలుగు చుక్కల లావెండర్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మూడు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అర స్పూన్ నారింజ తొక్కల పొడిలో ఒక స్పూన్ కొబ్బరినూనె కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ స్క్రబ్ చర్మంలో తేమ ఉండేలా చేస్తుంది.

ఒక బౌల్ లో అర స్పూన్ పంచదార పొడి, ఒక స్పూన్ నిమ్మరసం,కొన్ని చుక్కల రోజ్ ఆయిల్ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా చేయటం వలన చర్మంలో మృతకణాలు తొలగిపోతాయి.

ఒక స్పూన్ బియ్యంపిండిలో అరస్పూన్ రోజ్ వాటర్,అరస్పూన్ పాలు పోసి బాగా కలిపి ముఖానికి రాసి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.