వెంకటేష్ ఇంట్లో టీ పార్టీ.. F3 టీమ్ హంగామా..!

అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమా కాంబినేషన్ లో ఎఫ్ 3 సినిమా వస్తుంది.వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో తమన్నా, మెహ్రీ కౌర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 F3 Team Tea Party In Venkatesh House, Venkatesh House, F3movie, F3 Movie Release-TeluguStop.com

ఎఫ్3 లో సునీల్ కూడా స్పెషల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.ఇక సినిమా షూటింగ్ ప్రస్తుతం వెంకటేష్ హౌజ్ లో జరుగుతుందని తెలుస్తుంది.

షూటింగ్ గ్యాప్ లో టీ టైం లో చిత్రయూనిట్ అంతా కలిసి ఫోటో దిగారు.ఆ పిక్ ను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

బ్రదర్ వెంకటేష్ గారి ఇంట్లో షూటింగ్.టీం టైం లో ఇలా అంటూ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, సునీల్, రఘు బాబు, అనీల్ రావిపుడి కూడా ఫోటోలో ఉన్నారు.

ఎఫ్2 సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సినిమాను మించి ఎంటర్టైన్ చేసేలా ఈ సినిమా ఉంటుందని అనుకుంటున్నారు.ఎఫ్3 సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ ఫిక్స్ చేశారు.ఎఫ్ 2తో ఆడియెన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేసిన వెంకటేష్, వరుణ్ తేజ్ లు మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.తప్పకుండా మరోసారి ఈ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube