చిరూగా వెంకీ.. బాలయ్యగా వరుణ్ తేజ్.. డైలాగ్స్ తో చెలరేగిపోయారుగా..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఎఫ్ 3.ఈ సినిమాతో సమ్మర్ సోగ్గాళ్లుగా అలరించడానికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యారు.

 F3 Pre Release Event, F3 Movie, Dil Raju, Venkatesh, Varun Tej, Ani Ravipudi, Mehreen Pirzada, Tamannah Bhatia-TeluguStop.com

ఈ సినిమా కోసం ఇటు దగ్గుబాటి అభిమానులు, అటు మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఈ కామెడీ సినిమాలో సునీల్, అలీ, మురళీ శర్మ, ప్రగతి వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు.

దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.

 F3 Pre Release Event, F3 Movie, Dil Raju, Venkatesh, Varun Tej, Ani Ravipudi, Mehreen Pirzada, Tamannah Bhatia-చిరూగా వెంకీ.. బాలయ్యగా వరుణ్ తేజ్.. డైలాగ్స్ తో చెలరేగిపోయారుగా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా ఈ సినిమాకు సంబంధించిన వారంతా హాజరయ్యారు.

ఈ ఈవెంట్ కు ఫన్’టాస్టిక్ అనే పేరు పెట్టినట్టుగానే ఈ షోను కూడా డిజైన్ చేసి అక్కడ కూడా నవ్వులు పూయించారు.వెంకటేష్ చేసిన అల్ల్లరి అందరిని ఆకట్టుకుంది.

తన స్టార్ డమ్ ను పక్కన పెట్టి మరీ ఈ ఈవెంట్ లో అల్లరి చేస్తూ చెలరేగిపోయాడు.తన పాత్రకు రేచీకటి అనే విషయం తెలిసిందే.

అలాగే ఈ ఈవెంట్ లో కేసుల వెంకీ రేచీకటి ఉన్నట్టు చేసి అలరించాడు.

అలాగే రెండు టీమ్ లుగా డివైడ్ అయ్యి స్కిట్ లతో పాటు ఆటలుపాటలతో సందడి చేసారు.ఈ క్రమంలోనే వెంకీ మొక్కేకదా అని పీకేస్తే మీ పీక కోస్త అనే చిన్న రీల్ ను వెంకేటేష్ చేసి అలరించాడు.అలాగే వరుణ్ లక్ష్మి నరసింహ లోని ఒక డైలాగ్ చెప్పి బాలయ్యలాగా అదరగొట్టాడు.

ఇలా ఒక్కొక్కరు ఒక్కో సినిమా లోని డైలాగ్ చెప్పి అలరించారు.ఈ ఈవెంట్ మొత్తం ఫుల్ ఆకట్టుకుంది.

మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube