ఇప్పుడు చెప్పండి భయ్యా.. ఎఫ్‌ 4 ఉందా? లేదా?

మూడున్నర సంవత్సరాల క్రితం వచ్చిన ఎఫ్‌ 2 కు సీక్వెల్‌ అన్నట్లుగా ఎఫ్ 3 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎఫ్ 2 సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదల అయ్యి ఏకంగా వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్న విషయం తెల్సిందే.

 F3 Movie Released What About F4 Movie , Anil Ravipudi , F3 Movie , F4 , Film News , Movie News , Varun Tej , Venkatesh,ravi Teja-TeluguStop.com

ఇప్పుడు ఎఫ్ 3 సినిమా కు భారీ అంచనాలు ఉన్నాయి.కనుక తప్పకుండా సినిమా భారీ వసూళ్లను నమోదు చేసుకుంటుంది అంటూ ప్రతి ఒక్కరు బలంగా నమ్మారు.

ఎఫ్ 3 సినిమా కు సీక్వెల్ గా తప్పకుండా ఎఫ్ 4 ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా నమ్మారు.యూనిట్‌ సభ్యులు పదే పదే ఎఫ్‌ 3 సినిమా ప్రమోషన్ సమయంలో ఎఫ్‌ 4 ను చేస్తామంటూ ప్రకటించారు.

 F3 Movie Released What About F4 Movie , Anil Ravipudi , F3 Movie , F4 , Film News , Movie News , Varun Tej , Venkatesh,Ravi Teja-ఇప్పుడు చెప్పండి భయ్యా.. ఎఫ్‌ 4 ఉందా లేదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎఫ్‌ 4 సినిమా కు సంబంధించిన స్టోరీ లు కూడా రెడీ అయ్యాయి అంటూ వరుణ్‌ తేజ్ ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. దిల్‌ రాజు కూడా తప్పకుండా ఎఫ్ 4 సినిమా ను చేస్తాము అన్నాడు.

అనీల్ రావిపూడి ఇప్పటికే ఎఫ్‌ 4 కథ లు కూడా రెడీ అన్నట్లుగా చెప్పాడు.

కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఎఫ్‌ 4 లో మరో హీరో కూడా ఉండబోతున్నాడు అంటున్నారు.

వెంకటేష్ మరియు వరుణ్‌ తేజ్ లతో పాటు రవితేజ కూడా ఉంటాడు అంటూ ప్రచారం జరిగింది.తాజాగా ఎఫ్ 3 సినిమా విడుదల అయిన నేపథ్యం లో ఇప్పుడు చిత్ర నిర్మాత దిల్‌ రాజు కాని.

దర్శకుడు అనీల్‌ రావిపూడి కాని హీరో లు కాని ఎఫ్‌ 4 గురించి స్పందించాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.ఎఫ్ 3 కి మిశ్రమ స్పందన వచ్చింది.కనుక ఎఫ్‌ 4 గురించి ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు లేవు.అందుకే ఎఫ్‌ 4 గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్‌ 3 సినిమా వంద కోట్ల వసూళ్లు రాబడితే తప్పకుండా ఎఫ్ 4 ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube