ఈమద్య కాలంలో సినిమాలను ఎంత కష్టపడి తీస్తున్నారో.అంతకు మించి కష్టపడి ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది.
ఒక వేళ ప్రమోషన్ విషయంలో కాస్త అలసత్వం చూపించినా కూడా ఖచ్చితంగా భారీ డ్యామేజీ తప్పడం లేదు.ముఖ్యంగా పెద్ద సినిమాలకు మంచి ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది.
బాహుబలి.ఆర్ ఆర్ ఆర్.కేజీఎఫ్ సినిమాలకు పబ్లిసిటీ మెయిన్ అనడంలో సందేహం లేదు.ఆ మూడు సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్నాయి అంటే అది ఖచ్చితంగా కేవలం ప్రమోషన్ వల్లే.
అందుకే ఎఫ్ 3 సినిమా కోసం చిత్ర యూనిట్ సభ్యులు బాగా పబ్లిసిటీ చేస్తున్నారు.దర్శకుడు అనీల్ రావిపూడి కనిపించిన మార్గాలు అన్నింటిని కూడా వాడుకుంటూ ఎఫ్ 3 సినిమాకు ఫుల్ పబ్లిసిటీ చేస్తున్నాడు.
తెలుగు బుల్లి తెర రియాల్టీ షో లు కామెడీ షో లు ఇలా ప్రతి షో లో.ప్రతి ఛానల్ లో కూడా అనీల్ రావిపూడి కనిపించాడు.
ఆయన చేసిన సందడి ఆయన పేల్చిన పంచ్ ల కారణంగా ఎఫ్ 3 సినిమా ఓ రేంజ్ లో కుమ్మేస్తుంది అనడంలో సందేహం లేదు.

వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎఫ్ 3 సినిమా కోసం హీరోలు ఇద్దరు.హీరోయిన్స్ ముగ్గురు.నిర్మాత దిల్ రాజు కంటే కూడా అధికంగా అనిల్ రావిపూడి చాలా కష్టపడుతున్నాడు.
ఆయన సినిమా పూర్తి ప్రమోషన్ బాధ్యతలు ఆయన చూసుకుంటున్నాడు.చాలా విభిన్నంగా కామెడీ యాంగిల్ లోనే ప్రమోషన్ చేస్తున్నాడు.
ఈ శని లేదా ఆదివారాల్లో ఎఫ్ 3 సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.
ప్రీ రిలీజ్ వేడుక అయిన తర్వాత కూడా భారీ గానే అనిల్ పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది.