వీ6 ఛానల్ ద్వారా బిత్తిరి సత్తిగా మారిన చేవెళ్ల రవి ఇప్పుడు అదే పేరుతో అందరి తో పిలిపించుకుంటున్నాడు.వీ6 నుండి టీవీ 9 ఆ తర్వాత సాక్షిలో అదే తరహా మ్యానరిజం.మరియు మాటలతో అందరిని ఎంటర్ టైన్ చేసిన బిత్తిరి సత్తి ఇప్పుడు ఏ ఛానల్ లో ఉండటం లేదు.ఏ ఒక్క వ్యవస్థ వద్ద పని చేయడం లేదు.
సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ సమయంలోనే ఆయన తనదైన మార్క్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాడు.
ఆ మద్య సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు ను ఇంటర్వ్యూ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాడు.సినిమా కంటే సర్కారు వారి పాట ప్రమోషన్ లో భాగంగా సత్తి చేసిన హడావుడి.
మహేష్ బాబు నవ్విన నవ్వు గురించి చర్చ జరిగింది.
గతంలో ఎప్పుడు నవ్వుకోనంతగా మహేష్ బాబును బిత్తిరి సత్తి నవ్వించాడు.
ఇప్పుడు అదే సత్తి ఎఫ్ 3 టీమ్ తో ఒక ఆట ఆడేసుకున్నాడు.అనీల్ రావిపూడిని పడి పడి నవ్వించాడు.
ఆయన నవ్వుకు పక్కన ఉన్న వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు కూడా నవ్వారు.సత్తి వారిని ఇంటర్వ్యూ చేసి సినిమా ప్రమోషన్ ను చేయడం జరిగింది.
ఆ ఇంటర్వ్యూ చాలా వైరల్ అయ్యింది.ప్రతి ఒక్కరికి కూడా ఎఫ్ 3 సినిమా ను చేరువ చేసే విధంగా నే ఈ ఇంటర్వ్యూ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
పెద్ద ఎత్తున ఎఫ్ 3 సినిమా యొక్క ప్రమోషన్ ను నిర్మించిన యూనిట్ సభ్యులు చివరకు సత్తిని రంగంలోకి తీసుకు రావడంతో అసలు మజా వచ్చిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎఫ్ 3 సినిమా గురించి మాట్లాడుకునేలా ఆ ఇంటర్వ్యూ చేసింది.