'ఎఫ్ 3' ఓటిటి కోసం భారీ డీలింగ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్ 3‘.ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.

 F3 Movie Ott Release Date, F3 Movie Ott, Tamanna, Mehreen, F3 Movie, Anil Ravipudi, Venkatesh, Varun Tej-TeluguStop.com

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను కూడా చేసాడు.ఈ సినిమా గత నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.

 F3 Movie OTT Release Date, F3 Movie OTT, Tamanna, Mehreen, F3 Movie, Anil Ravipudi, Venkatesh, Varun Tej-ఎఫ్ 3#8217; ఓటిటి కోసం భారీ డీలింగ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.

వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటించారు.అలాగే అదనపు ఆకర్షణగా అనిల్ సోనాల్ చౌహన్, పూజా హెగ్డే ను కూడా తీసుకు వచ్చాడు.

ఈ సినిమా అందరి అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.అలాగే తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

థియేటర్ లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ మీద అలరించడానికి సిద్ధం అయ్యింది.ఈ సినిమాను ఓటిటిలో చూసేందుకు థియేటర్ లో సినిమా చూడని ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమాను 8 వారాల తర్వాత ఓటిటి లోకి తీసుకు రావాలని దిల్ రాజు టీమ్ భావించింది.దీంతో ఆలస్యంగా స్ట్రీమింగ్ కు తీసుకు వస్తామని తెలిపారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా కొద్దిగా ముందే స్ట్రీమింగ్ కి రాబోతుంది.సోనీ లైవ్ లో తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే ఇంత ముందుగానే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రావడానికి గాను 13 కోట్లు చెల్లించినట్టు టాక్ బయటకు వస్తుంది.మరి ఈ డీల్ చూస్తుంటే ఎఫ్ 3 సినిమా సాలిడ్ డీల్ అందుకున్నట్టే అనిపిస్తుంది.

ఇక ఈ సినిమా జులై 22 నుండి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కానుంది.మరి ఓటిటి లో ఎంత రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube