వరుస హిట్స్ తో దూసుకుపోతున్న కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ హిట్ తర్వాత మరల ఎఫ్2 సీక్వెల్ మీద ఫోకస్ పెట్టాడు.తన నెక్స్ట్ సినిమా ఇదే అని ఎనౌన్స్ చేసిన తర్వాత ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసేశాడు.
దిల్ రాజు భారీ బడ్జెట్ తో మరింత గ్రాండ్ గా ఈ సినిమాని ఆవిష్కరిస్తున్నారు.ఇక ఎఫ్3 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడు అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
అయితే ఆ హీరో ఎవరనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.ఇక హీరోయిన్లుగా తమన్నా, మెహరీన్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉండబోతుంది.
మూడు జంటల మధ్య నడిచే ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
ఇక కొద్ది రోజుల క్రితం వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఎఫ్3 ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించారు.
ఇక ఈ సినిమాలో డబ్బుని ప్రధాన పాయింట్ గా తీసుకొని కథని నడిపించబోతున్నట్లు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది.
సినిమా రెగ్యులర్ షూటింగును 23 నుంచి ప్రారంభించనున్నామని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.తమ వద్ద మరింత ఫన్, ఫ్రస్ట్రేషన్ ఉందని, మరింత వినోదానికి సిద్ధంగా ఉండాలని వెల్లడించింది.
ఇక ముహూర్తపు షాట్ ను వరుణ్ తేజ్, తమన్నాలపై అల్లు అరవింద్ క్లాప్ కొట్టి ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో దిల్ రాజు, అనిల్ రావిపూడి పాల్గొన్నారు.