డిస్కోరాజా హిట్‌ అయినా రవితేజ వద్దంటున్న నిర్మాత

రవితేజ చాలా సంవత్సరాల తర్వాత డిస్కోరాజా చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు.రాజా ది గ్రేట్‌ చిత్రం పర్వాలేదు అనిపించింది.

 F3 Movie Latest Update About Ravi Teja-TeluguStop.com

అంతకు ముందు రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా రవితేజకు హిట్‌ లేదు.డిస్కో రాజా చిత్రంతో రవితేజ మళ్లీ మునుపటి జోరును కొనసాగించడంఖాయం అంటూ అంతా అనుకున్నారు.

కాని దిల్‌రాజు మాత్రం రవితేజపై ఇంకా నమ్మకం పెట్టడం లేదు.ఎందుకంటే రవితేజ ఒకటి హిట్‌ అయితే రెండు ఫట్‌ అవుతున్నాయని దిల్‌రాజు భావిస్తున్నాడు.

Telugu Anil Ravipudi, Dillraju, Disco Raja, Dill Raju, Sequel, Ravi Teja, Ravite

గత ఏడాది ఎఫ్‌ 2 చిత్రాన్ని నిర్మించి సూపర్‌ హిట్‌ను దక్కించుకోవడంతో పాటు దాదాపుగా 50 నుండి 60 కోట్ల వరకు లాభాలను దండుకున్నాడు.అందుకే ఇప్పుడు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్‌ 3 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో చేసేందుకు సిద్దం అవుతున్నాడు.ఈ సీక్వెల్‌లో వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌లు నటించబోతున్నారు.వీరిద్దరితో పాటు మరో హీరో కూడా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.ఆ హీరో రవితేజ అంటూ నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

Telugu Anil Ravipudi, Dillraju, Disco Raja, Dill Raju, Sequel, Ravi Teja, Ravite

రవితేజ మార్కెట్‌ సరిగా లేని కారణంగా ఎఫ్‌ 3 చిత్రంలోకి ఆయన్ను తీసుకోవడంను దిల్‌రాజు వ్యతిరేకిస్తున్నాడట.అనీల్‌ రావిపూడికి మాత్రం రవితేజ అయితేనే బాగుంటుందని, వెంకీ మరియు వరుణ్‌లతో కలిసి రవితేజ అయితేనే ఎంటర్‌ టైన్‌మెంట్‌ చేస్తాడని అనీల్‌ నమ్ముతున్నాడు.ప్రస్తుతం దిల్‌రాజును ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube