ఎఫ్3 అప్పుడే ముగించేసిందట.. నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్!

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఎఫ్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా ఫుల్టూ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యింది.

 F3 Movie Business Completed, F3, Anil Ravipudi, Venkatesh, Varun Tej, Dil Raju,-TeluguStop.com

ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్‌తో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించాలని చిత్ర యూనిట్ గతంలోనే నిర్ణయించుకుంది.కాగా ఈ సినిమా సీక్వెల్‌ను ఇటీవల చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సీక్వెల్‌ను రెట్టింపు కామెడీ ఎంటర్‌‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు పక్కా ప్లానింగ్‌తో దూసుకెళ్తున్నాడు.

కాగా ఈ సినిమాకు ఎఫ్3 అనే టైటిల్‌తో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల లాంఛ్ చేశారు చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ అప్పుడే జోరుగా సాగుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.అటు శాటిలైట్ రైట్స్‌ను కూడా ప్రముఖ టీవీ ఛానెల్ అదిరిపోయే రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఎఫ్2 సక్సెస్ కారణంగా ఎఫ్3 చిత్రానికి ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.అందుకే ఈ సినిమా హక్కులను ముందుగానే సొంతం చేసుకునేందుకు తీవ్ర పోటీ నెలకొందని వారు అంటున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించి, సినిమాను అంతే త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా నటిస్తోన్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా నేపథ్యం ఈసారి డబ్బు చుట్టు తిరుగుతుందని, ఇది మరింత నవ్వులు పూయిస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.

ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఎఫ్2 సక్సెస్ రిపీట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube