ఎఫ్‌3 అప్పుడే రూ.80 కోట్ల బిజినెస్ చేసింది.. బడ్జెట్‌ ఎంతో తెలుసా?

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ కౌర్‌ హీరోయిన్స్ గా నటించిన ఎఫ్‌2 సినిమా సూపర్‌ హిట్ అయిన విషయం తెల్సిందే.ఆ సినిమా కు సీక్వెల్‌ అన్నట్లుగా ఎఫ్‌ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 F3 Movie Budget And Pre Release Business,venkatesh,varun Tej,tamnaah,mehreen,tol-TeluguStop.com

ఎఫ్‌ 3 సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయ్యింది.అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ అప్పుడే వచ్చేసింది.

ఇటీవలే ప్రారంభం అయిన ఈ సినిమా ను వచ్చే ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.మరో వైపు ఈ సినిమా అప్పుడే బిజినెస్‌ ఆకాశమే హద్దు అన్నట్లుగా చేస్తోంది.

భారీ వసూళ్లు చేసిన ఎఫ్‌ 2 కు సీక్వెల్‌ అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎఫ్‌ 3 కోసం వెయిట్‌ చేస్తున్నారు.

ఎఫ్‌ 3 సినిమా పై ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ మొత్తానికి ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా డిజిటల్‌ రైట్స్ ను అమెజాన్ వారు ఏకంగా రూ.12.5 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.మరో వైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ ను కూడా అప్పుడే నిర్మాత దిల్‌ రాజు అమ్మేశాడట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా శాటిలైట్‌ రైట్స్ దాదాపుగా రూ.12 కోట్లు పెట్టి జీ తెలుగు వారు కొనుగోలు చేశారు.డిజిటల్‌ మరియు శాటిలైట్‌ రైట్స్ ను వారు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినా కూడా దిల్‌ రాజు ఎఫ్‌ 3 రైట్స్ ను అమెజాన్‌ వారికి ఇచ్చేందుకు మొగ్గు చూపించాడట.

ఇక థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా మరో 50 కోట్లకు మించి వస్తాయని అంచనా వేస్తున్నారు.కేవలం 40 కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా ఏకంగా 80 కోట్లకు పైగా బిజినెస్‌ చేయడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.

ఈ సినిమా మొదటి పార్ట్‌ కంటే రెట్టింపు వినోదాన్ని అందిస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube