ఎఫ్‌ 3 హిట్‌ అయితే రామారావు ఖాయం

దర్శకుడు అనీల్‌ రావిపూడి వరుసగా సక్సెస్‌లు దక్కించుకుంటూ దూసుకు పోతున్నాడు.ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అంతకు ముందు సంక్రాంతికి ఎఫ్‌ 2 చిత్రంతో సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు.

 Director, Anil Ravipudi, Ram Charan, Balakrishna, Sankranti, F2, Sarileru Neekev-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాల నడుమ ప్రస్తుతం ఎఫ్‌ 3 చిత్రానికి రెడీ అవుతున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఎఫ్‌ 3 చిత్రాన్ని విడుదల చేసేవాడు.

కాని లాక్‌డౌన్‌ కారణంగా వచ్చే ఏడాది చివరి వరకు ఎఫ్‌ 3 చిత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఎఫ్‌ 3 చిత్రం తర్వాత అనీల్‌ కోసం పెద్ద ఆఫర్లు వెయిట్‌ చేస్తున్నాయి.

ఇప్పటికే రామ్‌ చరణ్‌ ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకున్నాడు.కాని ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్స్‌ కారణంగా ఆ సినిమాను ఆలస్యంగా చేద్దామంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది.మరో వైపు అనీల్‌ రావిపూడితో కలిసి సినిమాను చేసేందుకు బాలకృష్ణ గతంలోనే ఓకే చెప్పాడు.కాని ఏవో కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తుంది.

బాలకృష్ణ కూడా ఇప్పుడు అనీల్‌ రావిపూడితో సినిమాకు డేట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడట.సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లబోతుంది అంటున్నారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Corona, Ram Charan, Sankranti-Movie

ఎఫ్‌ 3 చిత్రం సక్సెస్‌ అయితే ఏమాత్రం ఆలోచన లేకుండా వెంటనే బాలయ్యతో గతంలో అనుకున్న ‘రామారావు’ చిత్రాన్ని అనీల్‌రావిపూడి మొదలు పెట్టబోతున్నాడు.బాలకృష్ణతో రామారావు అనే చిత్రంను రెండేళ్ల క్రితమే చేయాలని భావించిన అనీల్‌ రావిపూడి వాయిదా వేస్తూ వచ్చాడు.కాని ఈసారి మాత్రం ఖచ్చితంగా బాలయ్యతో ఆ ప్రాజెక్ట్‌ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube