అఫిషియల్ : 'ఎఫ్3' సంక్రాంతికి కాదట.. శివరాత్రికి రాబోతుందట!

F3 Makes A Surprising But Safe Decision

టాలీవుడ్ లో పండగలకు సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీ.అందులో మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అంటే మన హీరోలందరికీ ఇష్టం అప్పుడు సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్ల సునామీ రావడం ఖాయం కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన రికార్డ్ స్థాయి కలెక్షన్లు వస్తాయి.

 F3 Makes A Surprising But Safe Decision-TeluguStop.com

అందుకే సంక్రాంతి పండుగకు ముందుగానే డేట్స్ బ్లాక్ చేసుకుంటారు దర్శక నిర్మాతలు.

అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాను కూడా సంక్రాంతి బరిలోకి దింపుతున్నారని ప్రచారం జరిగింది.ఎఫ్2 సినిమా ఇప్పటికే సంక్రాంతికి విడుదల అయ్యి సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే.ఈ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తారని అందరు భావించారు.

 F3 Makes A Surprising But Safe Decision-అఫిషియల్ : ఎఫ్3’ సంక్రాంతికి కాదట.. శివరాత్రికి రాబోతుందట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయడం లేదని అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఇప్పటికే 2022 సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.ఆర్ ఆర్ ఆర్ సినిమా జనవరి 7న విడుదల అవ్వబోతుండగా.భీమ్లా నాయక్ జనవరి 12న, సర్కారు వారి పాట జనవరి 13న, రాధే శ్యామ్ సినిమా జనవరి 14 తేదీల్లో విడుదల కాబోతున్నాయి.

ఇన్ని సినిమాలు బరిలో ఉండగా ఎఫ్ 3 సినిమా రేస్ నుండి తప్పుకున్నట్టు స్పష్టం అయ్యింది.

ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు.ఈ సినిమాను సంక్రాంతి బరిలో కాకుండా శివరాత్రికి రాబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.ఎఫ్ 3 సినిమాను శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, మెహ్రీన్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మరి చూడాలి ఈ సినిమా ఎంత కడుపుబ్బా నవ్విస్తుందో.

#Anil Ravipudi #Tamannaah #Shivaratri #Dil Raju #Sankranthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube