ఎఫ్3కి కూడా టెండర్ పెట్టిన దిల్ రాజు.. నిజమేనా?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ఎఫ్3 తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను ఏర్పాటు చేసుకుంది.

గతంలో వచ్చిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి మరింత కామెడీ మూవీగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఈ సినిమా కోసం కేవలం ప్రేక్షకులే కాకుండా సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అంతేగాక ఈ సినిమాను భారీ ప్రాజెక్ట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొంది.

ముఖ్యంగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీ ఆఫర్‌లు వచ్చిపడుతున్నాయట.దీంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను తాజాగా అమ్మేసినట్లు తెలుస్తోంది.ఆయన నిర్మాణంలో వస్తున్న వకీల్ సాబ్ చిత్ర డిజిటల్ రైట్స్‌ను జీ స్టూడియోస్‌కు రూ.15 కోట్ల భారీ రేటుకు అమ్మేసిన దిల్ రాజు, ఎఫ్3 చిత్రాన్ని కూడా జీ స్టూడియోస్‌కు అత్యంత భారీ రేటుకు అమ్మేసినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే ధీమాతోనే ఇంత భారీ రేటుకు ఈ సినిమాను కొనుగోలు చేశారట.

మొత్తానికి ఎఫ్3 చిత్రం ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకముందే ఇలా భారీ రేటుకు డిజిటల్ రైట్స్ అమ్ముడుకావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు.అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర నవ్విస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)

తాజా వార్తలు