ఎఫ్3 కోసం కొత్త కథతోనే... ఈ సారి మరింత ఫన్  

F3 Movie Will Be Started Soon-f3 Movie,south Cinema,started Soon,tollywood

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఎఫ్ 2.ఈ సినిమా గత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చి ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

F3 Movie Will Be Started Soon-f3 Movie,south Cinema,started Soon,tollywood Telugu Tollywood Movie Cinema Film Latest News F3 Movie Will Be Started Soon-f3 South Cinema Started Soon Tollywood-F3 Movie Will Be Started Soon-F3 South Cinema Started Soon Tollywood

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోయింది.వెంకటేష్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా ఇది రికార్డు సృష్టించింది.

ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చాలా రోజులుగా టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా రవితేజ, వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా నటిస్తారని సమాచారం.

ఇదిలా ఉంటే ఎఫ్ 3 సినిమా గురించి దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్ లో చెప్పాడు.ఎఫ్3 సినిమాకి సంబంధించి ఇప్పటికే ఓ లైన్ అనుకున్నానని, అది ఎఫ్ 2 స్టైల్ లో ఉండదని అనిల్ చెప్పాడు.ఈ సినిమా ఎఫ్ 2కి సీక్వెల్ కాదని పూర్తిగా కొత్త కథతో తెరకేక్కుతుందని అన్నాడు.ఎఫ్ 3లో హీరోహీరోయిన్ల కెరీర్ పై కథ ఉంటుందని చెప్పినట్లు తెలుస్తుంది.

ఎఫ్-2 అంటే ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అయితే, ఎఫ్-3 అంటే ఫన్, ఫ్రస్టేషన్ అండ్ మోర్ ఫన్ అని చెబుతున్నారు.మరి ఈ సినిమాలో ఎవరిని హీరోలుగా ఫైనల్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

.

తాజా వార్తలు